మూడు రోజులలో ఆయన 39 కిలోమీటర్లు

YS Jagan

వైకాపా అధినేత జగన్ ప్రజాసంకల్ప యాత్ర పేరిట చేపట్టిన పాదయాత్ర నాలుగో రోజుకు చేరుకుంది. తొలి మూడు రోజులలో ఆయన 39 కిలోమీటర్లు నడిచారు. ఆయన వెంటన పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ కార్యకర్తలూ నడుస్తున్నారు. నాలుగో రోజు యాత్రను ఈయనీ రోజు ఉదయం 8.40 గంటలకు ప్రారంభించారు. నాలుగో రోజు యాత్రలో ఆయన వైకోడూరు,పెదన పాడులలో జనంతో మాట్లాడుతారు. పెదన పాడులో ఆయన మాట్లాడుతూ రైతు సమస్యల పరిష్కారానికి తాను అధికారంలోకి రాగానే అన్ని చర్యలూ తీసుకుంటానన్నారు. రైతుల కోసం ధర ల స్థిరీకరణ ను చేపడతామన్నారు. చంద్రబాబు అబద్ధపు హామీలతో ప్రజలను ఇక మభ్యపెట్టలేరని జగన్ అన్నారు. రైతలను ఆదుకోవడానికి ఏమేం చేయాలో సూచనలు ఇవ్వాల్సిందిగా రైతులను ఆయన కోరారు.