మూడు మిలియన్ల కస్టమర్ల రికార్డుతో విస్తారా

BUSi888
Vistara

మూడు మిలియన్ల కస్టమర్ల రికార్డుతో విస్తారా

కోల్‌కత్తా, అక్టోబరు 31: ఏవియేషన్‌ కార్యకలాపాలు ప్రారంభించిన రెండేళ్లలోనే విస్తారాఎయిర్‌లైన్స్‌ మూడు మిలి యన్ల కస్టమర్లతో రాకపోకలు సాగించిన రికార్డును సొంతం చేసుకుంది. టాటాసన్స్‌ సింగపూర్‌ ఎయిర్‌ లైన్స్‌ సం యుక్తంగా ప్రారంభించిన విస్తారా కస్టమర్లకు అనువైన విధివిధానాలు అమలుచేయడం వల్లనేమూడు మిలియన్ల కస్ట మర్లను రాబట్టుకోగలిగిందని సంస్థ వివరించింది. మూడుమిలియన్లవ కస్టమర్‌ అభినవ్‌ అధికారికి విస్తారా కోల్‌కత్తా ఎయిర్‌పోర్టులో భారీ స్వాగత సత్కారాలు ఏర్పాటుచేసింది. విస్తారా అభినవ్‌ అధికారికి విస్తారా బిజినెస్‌ క్లాస్‌ క్యాబిన్‌ ను ఢిల్లీ విమానంలో కేటాయించింది. అంతేకాకుండా సిఒఒ సంజీవ్‌కపూర్‌ అధికారికి ప్రత్యేక బోర్డింగ్‌పాస్‌ను కూడా అందచేసారు. విస్తారా సిఇఒ ఫీ టీక్‌ యోహ్‌ మాట్లాడుతూ సంస్థ ప్రారంభించిన రెండేళ్ల వ్యవధిలోనే 30 లక్షల మంది కస్టమర్లను సాధించామంటే తమ సేవలపట్ల ప్రయాణీకుల సంతృప్తికి నిదర్శనం అని చెప్పారు. అంతేకాకుండా ఇదే స్ఫూర్తితో భారత్‌లోనే ఐదు మిలియన్ల కస్టమర్ల సంఖ్యకు చేరేలక్ష్యంతో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్‌ నాటికి 20 లక్షల మంది కస్టమర్ల రాకపోకలు ఆసగించిన విస్తారా భారత్‌లో తన నెట్‌వర్క్‌ను విస్తరించింది. మొత్తం 18 గమ్యస్థానాలకు 515 వారం వారం విమానాలు నడుపుతోంది. కొత్తగా ఎ320 విమానం కూడా రప్పించింది. కోల్‌కత్తా, బెంగళూరు మధ్య సర్వీసులు పెరిగాయి. మెట్రోనగరాల మధ్య రెండు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించిందని విస్తారా ప్రకటించింది.