మూడు బ్యాంకులపై ఆర్‌బిఐ రూ.5కోట్ల జరిమానా

RBI
RBI

ముంబయి: ప్రభుత్వరంగంలోని రెండుబ్యాంకులు, ఒక ప్రైవేటు బ్యాంకుపై నిబందనలు అమలుచేయని కారణంగా రిజర్వుబ్యాంకు ఐదుకోట్ల రూపాయలు జరిమానాలు వడ్డించింది. ప్రైవేటురంగంలోనియాక్సిస్‌బ్యాంకుపై రూ.2 కోట్లు, యుకోబ్యాంకుపై రెండుకోట్లు, సిండికేట్‌ బ్యాంకుపై కోటి రూపాయలు జరిమానాలు విధించింది. అకౌంట్‌ పేయీ చెక్కులపై ఆర్‌బిఐ జారీచేసిన సర్క్యులర్‌ను పాటించకపోవడం, థర్డ్‌పార్టీ ఖాతాకు వచ్చే లబ్దిని జమచేయడంపై ఉన్న నిషేధాలను పాటించలేదని అంచనా. అంతేకాకుండా మోసాల వర్గీకరణపై వాణిజ్యబ్యాంకులకు నిర్దేశించిన మార్గదర్శక సూత్రాలను పాటించకపోవడం కూడా ఒక కారణంగా వెల్లడించింది. ఇక సిండికేట్‌ బ్యాంకుపరంగా జరిమానాను మోసాలపై జారీచేసిన మాస్టర్‌ సర్క్యులర్‌ను పాటించలేదని, రిస్క్‌మేనేజ్‌మెంట్‌ వ్యవస్థను పటిష్టంచేయలేదని ఆర్‌బిఐ వెల్లడించింది. యాక్సిస్‌బ్యాంకుపరంగా తప్పనిసరిజరిమానాను రూ.20 లక్షలుగా విధించింది. మాస్టర్‌ సర్క్యులర్‌లో నిర్దేశించిన విధంగా చెల్లనినోట్ల గుర్తింపుపై జారీచేసిన నిబందనలు అమలుచేయడంలేదని, ఇక నోట్ల గుర్తింపు, నోట్ల లెక్కింపు యంత్రాలను ఏర్పాటుచేయకపోవడం వంటివాటిపై ఈ జరిమానా విధించింది. ఈమూడు బ్యాంకులపైనా బ్యాంకింగ్‌క్రమబద్దీకరణచట్టం 1949 ప్రకారం ఆర్‌బిఐకి ఉన్న అధికారాలను ఉపయోగించి జరిమానా విదించినట్లు వెల్లడించింది. అంతేకాకుండా ఆర్‌బిఐజారీచేసిన నిబందనలను ఉల్లంఘించినట్లు నిర్ధారణ అయిందని జరిమానా విధించక తప్పలేదని వెల్లడించింది.