మూడు త‌రీల ప్రేమ ఆప్యాయ‌త‌లు

Premato mee kaarteek
Premato mee kaarteek

మూడు జెనరేషన్స్‌ మధ్య ఏమ ఆప్యాయతల్ని చక్కగా తెరకెక్కించిన చిత్రం ‘ప్రేమతో మీ కార్తిక్‌. రిషిని దర్శకుడిగా పరిచయం చేస్తూ రవీందర్‌ ఆర్‌.గుమ్మకొండ ఈచిత్రన్ని నిర్మించారు.. ఈసినిమాతో కార్తికకేయ, సిమ్రాత్‌లు హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు.. షాన్‌ రెహమాన్‌ అందించిన ఆడియో , వీడియో సాంగ్‌ను సక్సెస్‌పుల్‌ నిర్మాత దిల్‌రాజు విడుదలచేశారు.. అంతేకాకుండా ఈసినిమా దిల్‌రాజు ద్వారా నవంబర్‌ 17న విడుదల కానుంది. దర్శకుడు రిషి మాట్లాడుతూ, ఊరు వదిలి విదేశాలు వెళ్లిన ఓ కొడుకు తనుకోల్పోయిన జీవితాన్ని తన కొడుక్కి ఇవ్వాలని చేసిన ప్రయత్నమే ఈచిత్రం మూల కథ అన్నారు. సీనియర్‌ నటుడు గొల్లపూడి మారుతిరావు, మురళి శర్మ చాలా మంచి పాత్రలో నటించారన్నారు.. ట్రైలర్‌ను త్వరలో విడుదల చేస్తామన్నారు.. నిర్మాత అశోక్‌రెడ్డి మాట్లాడుతూ, మా అన్నయ్యగారి అబ్బాయి కార్తీక్‌ హీరోగా చేస్తున్నాడని అన్నారు. దిల్‌రాజు ఆధ్వర్యంలో ఈచిత్రాన్ని ఈనెల17న విడుదల కానుందని అన్నారు.