మూడురాష్ట్రాల్లో భారీ వర్షాలు

Rain
Rain

ముంబయి: మహారాష్ట్ర,కర్నాటక, గోవా రాష్ట్రాల్లో ఈ వారాంతంలోనే వర్షాలు ముంచెతుతున్నాయి. ముంబయి ప్రాంత నివాసితులు ఎవ్వరూ బైటికి వెళ్లవద్దన్న హెచ్చరికలుసైతం జారీ అయ్యాయి. భారత్‌పశ్చిమతీరంవెంబడి అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉరుములుమెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నట్లు తేలింది. ముంబయితోపాటు థాణె, రా§్‌ుఘడ్‌, రత్నగిరి, సింధుదుర్గ్‌ జిల్లాలు మహారాష్ట్రపరంగా భారీ వర్షాలకు లోనయ్యే అవకాశం ఉంది. శనివారంసైతం ఇక్కడ వర్షాలు ఎక్కువ ఉంటాయని వాతావరణశాఖ వెల్లడించింది. 204.5 మిల్లిమీటర్లకుపైబడి వర్షం కురుస్తుంది. అయితే ముంబయికి రుతుపవనాలు జూన్‌పదవ తేదీకల్లా అందుతాయి. మేఘావృతమైన వాతావరణం భారీ వర్షాలతో రోడ్లపై చెట్లుసైతం కూలిపడే ప్రమాదం ఉందని అంచనావేసింది. మత్స్యకారులు సముద్రంలోచేపలవేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. కొంకణ్‌, గోవా తీర ప్రాంతాల్లోను, పశ్చిమ మధ్య ప్రాంతాలు, నైరుతి అరేబియన్‌సముద్రం, సోమాలియా తీరం ప్రాంతం వెంబడి 12వ తేదీవరకూ వర్షాలు కురుస్తాయని అంచనా. అదేస్థాయితో ఉరుములుమెరుపులు, భారీ ఈదురుగాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వస్తాయి. ఒకదశలో గంటకు 60 కిలోమీటర్ల వేగం కూడా ఉంటుందని వెల్లడించింది. కేరళ, కర్నాటక,మహారాష్ట్ర కోస్తాల వెంబడి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.సముద్ర అలలు సైతం భారీ ఎత్తునప్రకంపనలకుగురవుతాయి. తూర్పుమధ్యప్రాంతం, పశ్చిమమధ్యప్రాంతం, నైరుతి అరేబియా సముద్రం, ఉత్తరబంగాళాఖాతంలలో పెనుమార్పులు ఉంటాయని వాతావరణశాఖ తన బులిటెన్‌లో హెచ్చరించింది. దక్షిణ కొంకణ్‌, గోవా, కోస్తా కర్నాటకప్రాంతాల్లో భారీ వర్షాలనుంచి మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో మరింత ఉధృతంగా వర్షాలు ఉంటాయని తేలింది. మధ్యమహారాష్ట్ర, ఉత్తర కర్నాటక తీర ప్రాంతంలలో కూడా భారీ వర్షాలుంటాయి. ఇక ఉప హిమలాయ ప్రాంతం, పశ్చిమబెంగాల్‌, సిక్కిం, ఒడిశా, మరాట్వాడా, తెలంగాణ, దక్షిణ కోస్తా తీరం, కేరళ రాష్ట్రాల్లోసైతం భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. పిడుగులసైతం పడే అవకాశం ఉందని, పెద్ద ఎత్తున ఉరుములుమెరుపులతో పిడుగులుసైతం పడే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌,మధ్యప్రదేశ్‌, విదర్భ, ఛత్తీస్‌ఘర్‌, జార్ఖండ్‌, బీహార్‌, గంగానది ఉన్న పశ్చిమబెంగాల్‌, ఒడిశా, కోస్తా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లోను, తమిళనాడులో వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. రాజస్థాన్‌లోని రెండు ప్రాంతాల్లో మాత్రమే వేసవి వడగాడ్పులుకొనసాగుతాయని అంచనా. భారత వాతావరణశాఖ అంచనాలప్రకారం చూస్తే అల్పపీడనప్రభావం బంగాళాఖాతంలో అలుముకుంది. దీనివల్ల నైరుతి రుతుపవనాలు బెంగాల్‌, ఒడిశాకు శనివారంనుంచే వస్తాయని అంచనావేసింది. పశ్చిమబెంగాల్‌, బంగ్లాదేశ్‌ తీరం వెంబడి ఉత్తరంవైపుగా పయనిస్తుందని, వాతావరణశాఖ వెల్లడించింది. ఇక ఢిల్లీలో మరింతగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ఉంటుందని కనిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్‌, గరిష్టంగా 40 డిగ్రీల సెల్సియస్‌ ఉంటుందని వెల్లడించింది. రాజస్థాన్‌లో ఇటీవలి వర్షాలకు ఏడుగురుచనిపోయారు. ఇక కేరళపరంగాచూస్తే నైరుతి రుతుపవనాలు కేరళనుముంచెత్తుతున్నాయి. వచ్చే ఐదురోజులపాటు సైతం భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ ఇన్‌ఛార్జి కె.సంతోష్‌ వెల్లడించారు. ముంబయి మహానగరాన్ని సైతం భారీ వర్షాలుముంచెత్తుతున్నాయి. జాతీయ ఉపద్రవ నివరాణ టీమ్‌లు పరేల్‌, మన్‌ఖుర్గ్‌ వంటి తూర్పు ప్రాంతాల్లోను, అంధేరి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌వద్ద పశ్చిమ ప్రాంతాలకోసం నియమించినట్లు అధికారులు వెల్లడించారు. నౌకాదళ సిబ్బంది కోలాబా,వోర్లి, ఘట్కోపార్‌, ట్రాంబే, మలద్‌ వంటిప్రాంతాల్లో వరద నివారణచర్యలకుసిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది.