ముస్లింలంతా ఏకమవ్వాలి

ASADUDDIN OWISI
ASADUDDIN OWISI

హైదరాబాద్‌: ఏఐఎంఐఎం చీఫ్‌, హైదరాబాద్‌ ఎంపి అసదుద్దీన్‌ ఒవైసీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో లౌకికివాదం కొనసాగాలంటే..ముస్లింలంతా ఏకమవ్వాలని, వాళ్లంతా ముస్లింలకే ఓటేయాలని అన్నారు. మహారాష్ట్రలోని బీడ్‌లో జరిగిన ఓ సభలో అసద్‌ వ్యాఖ్యలు చేశారు. యూపీలోని హపూర్‌ జిల్లాలో ఆవుల స్మగ్లింగ్‌ చేస్తున్నాడంటూ ఖాసిమ్‌ అనే వ్యక్తిని కొట్టి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనను అసద్‌ ప్రస్తావించారు. ఖాసిమ్‌ హత్య మనందరినీ మరోసారి ఆలోచించేలా చేస్తున్నది. అతని కోసం కన్నీళ్లు పెట్టకండి. కానీ సంఘటితమవ్వండి.