ముస్తాబైన ‘నెల్లూరి పెద్దారెడ్డి’

NELLORE PEDDAREDDY
NELLORE PEDDAREDDY

ముస్తాబైన ‘నెల్లూరి పెద్దారెడ్డి’

సతీష్‌రెడ్డి, మౌర్యానీ , ముంతాజ్‌ హీరో హీరోయిన్లుగా దర్శకుడు విజె రెడ్డి రూపొందించిన చిత్రం నెల్లూరి పెద్దారెడ్డి. సిద్ది విఘ్నేశ్వరరా క్రియేషన్స్‌ పతాకంపై సిహెచ్‌ రఘునాధరెడ్డి ఈచిత్రాన్ని నిర్మించారు.. ప్రభాస్‌ శ్రీను, అంబటి శ్రీను ,సమ్మెట గాంధీ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.. గ్రామీణ నేపథ్యంలో సాగే ఆహ్లాదకరమైన ప్రేమకథగా ఈసినిమా తెరకెక్కింది.. చిత్ర నేపథ్యం భావోదేవ్గఆలతో ఉన్నా..కథనం అద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది.. నెల్లూరి పెద్దారెడ్డి చిత్రానికి సెన్సార్‌ యుబైఎ సర్టిఫికెట్‌ అందించింది.. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈచిత్రం గ్రాండ్‌ రిలీజ్‌కు సిద్ధమైంది.. ఈనెల 16న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. దర్శకుడు విజెరెడ్డి మాట్లాడుతూ, ఈనెల 16న దాదాపువంద థియేటర్లలో ఈచిత్రాన్నివిడుదల చేయనున్నామ్నఇ తెలిపారు. పల్లెవాతావరణంలో కథ సాగుతుందన్నారు. పచ్చటి పైరుల అందాలు ప్రేక్షకులకు ఆహ్లాదాన్ని కల్గిస్తాయన్నారు.. ఎక్కడా విసుగులేకుండా కథనం సాగుతుందన్నారు.. కార్యక్రమంలో కథానాయకుడు సతీష్‌రెడ్డి మాట్లాడుతూ, 28 రోజుల్లోనే షూటింగ్‌ పూర్తిచేసామన్నారు.. 16న థియేటర్లలో ప్రేక్షకులను అలరించటానికి సిద్ధమవుతున్నామని తెలిపారు.