ముళ్ల మధ్యన బతుకున్నవాడిని: మోడీ

 

MODIFF
న్యూఢిల్లీ: ముళ్ల మధ్య బ్రతికిన వాడిని, ముళ్ల మధ్యన బ్రతుకుతున్న వాడిని… ముళ్ల మధ్య బ్రతుకు గడపాల్సినవాడిని, నన్ను పువ్వులాగా సున్నితం కానీయకండి అంటూ ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. గ్యాంటటక్‌లో జరిగిన వివిధ రాష్ట్రాల వ్యవసాయం మంత్రుల సదస్సులో మంగళవారం ఆయన పాల్గొన్నారు. అయితే అవసరమైనపుడు పువ్వులాగా సున్నితంగా ఉండాల్సి వస్తుందని, బాధితుల కన్నీరు తుడిచే భాగ్యం తనకు కలిగిందని.. ఇంత కంటే ఈ జీవితానికి సౌభాగ్యమం ఏముంటుందని అన్నారు. సిక్కి ప్రభుత్వం అభివృద్ది చేసిన మూడు అర్చిడ్‌ జాతుల పువ్వుల పేర్లను ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ పువ్వులకు వరుసగా సర్దార్‌ పటేల్‌ పేరిట సిబిడియమ్‌ సర్దార్‌, దీన్‌దయాళ్‌ ఉపాధ్యా పేరిట సిబిడియమ్‌ దయాళ్‌, మోడీ పేరిట సింబిడియమ్‌ నమో అనే పేర్లు పెట్టారుజ