ముల్లంగిలో ఔషధగుణం

Mullamgi
Mullamgi

ముల్లంగిలో ఔషధగుణం

ముల్లంగి అనగానే ముక్కు మూసుకునే వాళ్లు ఎందరో. దీని వాసన అభ్యంతరకరంగా ఉన్నా కూడా ఎంతో ఆరోగ్యాన్ని ఇవ్వగలదు. ముల్లంగిని చాలామంది ఆహారానికి దూరంగా పెట్టేస్తారు. దాని గురించి సరైన అవగాహన లేకపోవడమే అందుకు కారణం. కానీ వాస్తవానికి ముల్లంగిలో మేలు చేసే ఔషధ గుణాలెన్నో పుష్కలంగా ఉన్నాయి.

దీన్ని మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే చక్కని ఆరోగ్యం మీ సొంతమవ్ఞతుంది. లివర్‌ను ఆరోగ్యంగా ఉంచగలదు ఈ ముల్లంగి. ముఖ్యంగా జాండీస్‌ లేదా కామెర్ల వ్యాధి బారిన పడినవారు తరచూ ముల్లంగి తింటే లేదా రసాన్ని త్రాగితే శరీరంలోని విషపూరిత పదార్థాలు తొలగిపోతాయి. జీర్ణశక్తిని వృద్ధిచేస్తూ శరీరంలో నీరు నిలిచేలా చేస్తుంది.

పైల్స్‌ వ్యాధిగ్రస్తులకు ముల్లంగి చక్కని ఔషధమే. మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడమే కాదు శరీర బరువ్ఞను తగ్గించేందుకు ముల్లంగి ఎంతగానో ఉపయోగపడుతుంది. ‘సి విటమిన్‌, ఫోలిక్‌యాసిడ్‌, యాంథోసియానిక్‌లు ముల్లంగిలో ఉన్నందువల్ల తరచూ ఇది తింటే కేన్సర్‌ బారినపడకుండా జాగ్రత్తపడవచ్చు. పురుగు కాటు, తేనెటీగ కాటు నుంచి వచ్చే నొప్పిని తగ్గిస్తుంది ముల్లంగి. చర్మవ్యాధులు దీనిలోని సి-విటమిన్‌, ఫాస్పరస్‌, జింక్‌, బి-విటమిన్‌ చర్మానికి ఎంతో మేలు చేస్తాయి.

ముల్లంగి గుజ్జు ముఖానికి మంచి తేజస్సునిస్తుంది. ఇందులోని వ్యాధినిరోధకగుణం చాలా రకాల చర్మవ్యాధులను రాకుండా అడ్డుకుంటుంది. ముల్లంగి రసంలో నల్ల ఉప్పును కలుపు కుని తాగితే ఇన్ఫెక్షన్లను తీసివేస్తుంది.

దాంతో జ్వరం నెమ్మదిస్తుంది. వీటితో పాటు ముల్లంగి ఆకలిని వృద్ధిచేస్తుంది. అలాగే నోటిశ్వాసను తాజాగా ఉంచుతుంది. రక్తసరఫ రాను మెరుగుపరుస్తుంది. కడుపులో మంట, తలనొప్పి, దగ్గుని తగ్గిస్తుంది.