మురిపిస్తే ఆనందాల హరివిల్లు మీదే!

   మురిపిస్తే ఆనందాల హరివిల్లు మీదే!

Couple
Couple

జీవితం అంటే అంతులేని పోరాటం కాదంటారా! నిత్యం ఎదురయ్యే సమస్యలు కొన్నయితే అనవసరంగా తెచ్చిపెట్టుకునే సమస్యలు ఇంకొన్ని. ఏమయినా సజావ్ఞగా జీవితం సాగడం లేదన్నది దీనర్థం. అందులోనూ ఇంటి విషయాలకొచ్చేసరికి స్త్రీలందరికి ఎదురయ్యే సమస్యలలో సర్దుకుపోవాలన్నతత్వం లేకపోతే మరింత అసహనం ఆవరిస్తుంది. భర్తలని, ఇంటివాళ్లని మార్చేసి ఉద్ధరిద్దామంటే ఇదేమీ నవల, సినిమా కాదు, జీవితం మరి. అయితే అదే జీవితంలోని మెలోడ్రామాకు మెలోడ్రామాయే విరుగుడు. ఎలాగంటారా చదవండి మరి? ‘మేమూ బయటకెళ్లి సంపాదిస్తున్నాం కదా, ఇంటి పనుల్లో కాస్త సాయంచేస్తే ఏం పోతుంది అని ఏ భర్తనైనా కదిపి చూడండి. కొంతమంది మహానుభావుల్ని మినహాయిస్తే మిగిలిన అందరూ అదేదో తగనిమాట అయినట్టే చూస్తారు. ‘నూతన తరం గహిణి-ఆమె బాధ్యతలు అనే అంశం మీద వారిదైన ‘బాణీలో భార్యకి హితబోధ చేసేందుకే ప్రయత్నిస్తారు. ఎన్నో కొత్తరంగాల్లో ప్రవేశించి సరికొత్త జీవనశైలిలోకి జీవితాన్ని ఒంపుకున్న నేటి మహిళకి ఇదో కొత్త బాధ్యత. ఎంత స్పీడైన అమ్మాయిలైనా తమ అర్ధభాగంతో ఇంటిపని కాస్తయినా చేయించాలంటే ఆచరించాల్సిన మార్గాలివి.

‘ఇటీవల ఒక భర్త ఇలా చెప్పాడు. నా భార్య ఉద్యోగానికి ఉదయం 8గంటలకే వెళ్లిపోతుంది. నేను పదిగంటలకు వెళ్తాను. ఆమె వంటపని, ఇతర పనులు చేసి, కొన్ని పనులను వదిలేస్తుంది. ఆ పనులను నేను పూర్తి చేస్తాను. వంటిల్లు శుభ్రంగా ఉంచుతాను. స్టౌవ్‌ను నీట్‌గా చేస్తాను. ఇలాంటి చిన్నచిన్న పనులన్నీ చేసి, ఆఫీసుకు వెళ్తాను. ఇంటిపని కేవలం భార్య పనే అనే ఆలోచన నాకెప్పుడూ కలగలేదు అంటాడు ఆయన. నిజమే కాలం మారింది. భర్తతోపాటు భార్యలు పనిచేస్తున్నారు. పురుషుడికి సమానంగా స్త్రీలు ఉద్యోగం చేస్తున్నారు. ఇక్కడ ఒకరు ఎక్కువ అని కాదు, మరొకరు తక్కువ అని కాదు. సంసార బండికి రెండు చక్రాలు అవసరమే. ఏ చక్రం ఊడిపోయినా, బండి ముందుకు సాగదు. కానీ ఈ భావన అందరి భర్తల్లో ఉండదు. భార్య ఎంత ఉద్యోగస్తురాలైనా ఇంటిపని, వంటపని, పిల్లల పని ఆమె పనే అనుకుంటారు. తాము చేస్తే అది చిన్నతనంగా, పురుషుడి లక్ష్యం కాదని అనుకుంటారు. ఎందుకంటే పురుషులు లోలోపల తాము స్త్రీల కన్నా అధికులం అనుకుంటారు కాబట్టి వారికి స్త్రీలు ‘ఈ పనిచేయండి అని ఆజ్ఞాపిస్తే తిక్కరేగుతుందట. ఒక ఇంట్లో అయితే అసలు వినిపించుకోరు. మరీ పోరుపెడితే బయటకి వెళ్లిపోతారు కానీ వంటింట్లోకి మాత్రం వెళ్లరు. (ఇది బహుశా వివాహిత స్త్రీలందరికీ స్వానుభవం) ‘ఎందుకు చేయవు, నీకు మాత్రం బాధ్యతలేదా అని గట్టిగా అడిగితే మొత్తం సీను రివర్సు కావచ్చు. అలాగని అంతపని చేయమని కాలరు పట్టుకుని బతిమాలే సమయం కూడా ఉండదు కాబట్టి చిన్న తిరకాసు పెట్టవచ్చు. ‘ఇంటి పనిచేయడం అంటే నా భార్యకి నేను చేస్తున్న మేలు అనే భావం కలిగించగలిగితే మాత్రం ఒళ్లు వంచి పనిచేయవచ్చు.

పనిపై చులకభావం
వద్ద చాలామంది భర్తలు వేసే ప్రశ్న ఇది. ‘నేను ఆఫీసుకి వెళ్లిన దగ్గర నుంచి నువ్వు చేసేదేముంది. చుట్టుపక్కల ఇళ్లవారితో కబుర్లు చెప్పుకోవటం లేదంటే టీవి పెట్టుకుని చూడటం అంతేకదా అంటారు. ఇది వినీవినీ విసుగొచ్చిన ఓ భార్య ఒకరోజు ఆయన గారు ఆఫీసుకెళ్లగానే దుప్పటి ముసుగుపెట్టి నిద్రపోయింది. అయ్యగారు ఆఫీస్‌ నుంచి వచ్చారు. పరాయి ఇంటికి వచ్చానేమోనని బయటకి పరిగెత్తబోయి ఆగి అనుమానంగా చూశాడు. ఇంకేముంది. ఇల్లంతా నేల కొంచెమైనా కనిపించకుండా పిల్లలు గిరాటు వేసిన వస్తువులు, బొమ్మలు, విడిచిన బట్టలు, కూరగాయల తొక్కలు, చెల్లాచెదురుగా దుప్పట్లు, దిండ్లు వగైరాలతో నానా గందరగోళంగా ఉంది. భార్య రూపం కూడా రోజూలా కడిగిన ముత్యంలా కాకుండా ఇల్లులాగే ఉంది. ‘ఏమైంది? అన్నాడు కంగారుగా. ‘ఏమీ కాలేదు, ఏమీ చేయలేదు. అందామె తాపీగా ఉదయం నుంచి భార్య ఏం చేస్తూ ఉంటుందో ఆయనకి అర్థమైంది. తర్వాత ఒక వారంరోజులు ఆమె అస్వస్థతకు గురైంది. మంచం ఏమాత్రం దిగలేని పరిస్థితి ఆమెకు ఎదురైంది. అప్పుడుకానీ ఆ భర్తకు భార్య విలువ, ఆమె చేస్తున్న కష్టం అర్ధమైంది. అందుకే- ఏ ఆదివారమో అతను తీరిగ్గా ఇంట్లో ఉన్న సమయంలో మీ ఇద్దరు సిసింద్రీలను అతని మీద వదిలేసి, ఇంట్లో ఉన్న పనులను చేసే పరిస్థితి కల్పించండి. లేని బిజీని మీకు మీరు సష్టించుకోండి. లేదా మీ భర్తతో పందెం వేయండి. ‘రెండు గంటల్లో ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ, ఓ మోపెడు బట్టలు ఇYసీ చేయటం, ఇల్లు సర్దేయటం వంటివి చేయగలరా అని. అంతే! మీ వారు రెండుచేతులు ఎత్తేసి మీకో నమస్కారం పెట్టేస్తారు.

మెచ్చుకుంటే పనులు ఇట్టే పూర్తయిపోతాయి పనులు చేయించుకోవడానికి పిల్లలకు తల్లులు లంచాలు ఇవ్వటం ఇళ్లలో మామూలే. అటువంటి లంచం పొగడ్త రూపంలో భర్తకీ ఇవ్వమని డాక్టరుగారు సెలవిస్తున్నారు. ‘మీ పనులు, పద్ధతులు నాకు బాగా నచ్చుతాయి. మీరు చాలా సమర్ధవంతులు ఇలాంటి మాటలతో వారిని మురిపించి పనులు చేయించుకోవచ్చు.

నచ్చేలా చెప్పండి
మగవారికి సాధారణంగా ఇంటిపనులంటే చచ్చేంత చిరాకుగా ఉంటుంది. మేమేంటి ఈ పనులు చేయడమేంటి అనే భావం వారిలో సహజంగానే ఉంటుంది. అయినా వారి నుంచి సహాయం పొందితీరాలి అని మీరు నిశ్చయించుకున్నారు కాబట్టి వారికి పనులు చెప్పే తీరులో చెప్పాలి. మగవారు ఏదైనా పనిని సవాలుగా తీసుకుని చేయ డానికి ఇష్టపడతారు. అలాగే వారు వెనక ఎవరైనా ఉండి సతాయించడాన్ని సహించ లేరు. ఇంటిపనుల్ని ఒక్కొక్కటి వారి వెంటపడి చెప్పే బదులు ఏమేం చేయాలో ఒక్కసారే చెప్పాలట. మళ్లీ మళ్లీ చెప్పే అవసరం లేకుండా అన్నింటినీ ఒకేసారి చెప్పేయాలి. పనులు ఎలా చేస్తున్నారని వారిమీద అజమాయిషీ చేయకుండా వదిలేయాలి. భర్తలతో పని చేయించడానికి కోల్‌మాన్‌ మరో చిట్కా కూడా చెబుతున్నారు. మీ నుంచి వారు సరదాలు, సరసాలు ఆశిస్తుంటే ఇంటి పని నుంచి మీకు కొంత విముక్తి కావాలని అడగమంటున్నారు. వాళ్లు ఆశించినట్టుగా వారితో ఎక్కువ సమయం గడపాలంటే వంట, ఇంటి పనుల నుంచి కాస్త విశ్రాంతి ఉండాలని తీయగా చెప్పిచూడమంటున్నారు ఆయన.

సరే వీటిని చేయకపోతే ఏం చేద్దాం
్య సహాయనిరాకరణని ప్రకటించవచ్చు. దీనివల్ల పిల్లలు ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యత మీదే.
్య చిన్న చిన్న ఇబ్బందులకు గురిచేయవచ్చు. కూరల్లో ఉప్పుకారాలు ఎక్కువ వేయడాలు, బట్టలు ఆయన ఆశించినంత శుభ్రంగా ఉంచకపోవటం. అన్నీ అనుకూలంగా అమర్చిపెట్టకపోవటం ఇలాంటివి.్య ఆరోగ్యం అసలు సహకరించడంలేదని (నటనే) మంచం ఎక్కేయవచ్చు. మీరు అత్యవసరంగా తనకి దూరంగా ఉండే పరిస్థితులు కల్పించుకోండి. ఉదా. ఎవరికైనా ఆరోగ్యం బాగోలేదని, మీ అవసరం అత్యవసరం అయ్యే పరిస్థితులు కల్పించుకోండి. ఓ వారం పాటు ‘అన్ని బరువు బాధ్యతలు ఆయనపై వేసి తప్పుకోండి.