మునుగోడు మంత్రి కెటిఆర్ ప‌ర్య‌ట‌న‌

KTR
K T. Ramarao

నల్గొండ: జిల్లాలోని మునుగోడు నియోజకవర్గం పరిధిలోని చండూరులో స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన ప్రగతి సభ జరిగింది. ఈ సభకు మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి హాజరయ్యారు. రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ మందుల సామెల్, ఆగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ లింగంపల్లి కిషన్ రావు, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ బాలు నాయక్, ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, వేముల వీరేశం, రవీంద్ర నాయక్, పైళ్ల శేఖర్ రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు రామచంద్ర నాయక్, నల్గొండ నియోజకవర్గం టీఆర్‌ఎస్ ఇంచార్జ్ కంచర్ల భూపాల్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి సమక్షంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్ణటి విద్యాసాగర్, చండూర్ జడ్‌పీటీసీ సంతోష్ శేఖర్ టీఆర్‌ఎస్‌లో చేరారు. అంతకుముందు చండూరులో తెలంగాణ తల్లి, ఆచార్య జయశంకర్ విగ్రహాలను మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి ఆవిష్కరించారు. చండూరు మండల కేంద్రంలో నాలుగు కోట్ల రూపాయలతో నిర్మించ తలపెట్టిన రహదారుల విస్తరణ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.