ముత్యాల ముగ్గు

muggulu
muggulu

త్వరలో ధనుర్మాసం రానున్నది. ఈ మాసానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇంటి ముందు అందంగా తీర్చిదిద్దే ముగ్గులను వేయడం హిందువ్ఞల సంప్రదాయం. నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగకు ప్రత్యేక ముగ్గులతో శోభాయమానంగా తీర్చిదిద్దుకుంటారు. మరి ముగ్గు వేసేందుకు చెలి పాఠకుల నుంచి ఆహ్వానం పలుకుతున్నది. వైవిధ్యమైన చక్కని రంగుల ముగ్గులను మాకు పంపండి. ఇందుకు మీరు గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఇవి..

  • మీ పాస్‌ఫొటో సైజు కలర్‌ ఫొటోను తప్పనిసరిగా జతచేయాలి. ఫొటో లేకపోతే ముగ్గు ప్రచురించబడదు.
  • ఎ 4 సైజు పేపర్‌లో మాత్రమే ముగ్గు వేయాలి.
  • చుక్కల ముగ్గులయితే ఎన్ని చుక్కలు, ఎన్ని వరుసలు వంటి వివరాలు స్పష్టంగా రాయాలి.
  • మీ పేరు, పూర్తి చిరునామా స్పష్టంగా రాయాలి.
  • మీరే స్వయంగా ముగ్గు వేసినట్లుగా తెలియజేసే లేఖ రాయాలి.
    మా చిరునామా: ఎడిటర్‌, చెలి రంగుల హరివిల్లు, వార్త జాతీయ దినపత్రిక, డోర్‌నెం: 396, లోయర్‌ ట్యాంక్‌ బండ్‌, హైదరాబాద్‌ – 500080.
  • తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/