‘ముత్తూట్‌లో దోపిడీకి విఫలయత్నం

MF
MF

రంగారెడ్డిః  రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలోని ముత్తూట్‌ ఫైనాన్స్‌ కార్యాలయంలో మంగళవారం దుండగులు దోపిడికి విఫలయత్నం చేశారు.
ఉదయం ఆఫీస్‌ తెరవగానే లోపలికి ప్రవేశించిన దుండగులు క్యాషియర్‌ను తుపాకీతో బెదిరించారు.
దీంతో అప్రమత్తమైన ఇతర సిబ్బంది అలారం మోగించడంతో వారు భయపడి పారిపోయారు.
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.