ముడతలు లేని ‘జల’వర్చస్సు

cute lady
cute lady

ముడతలు లేని ‘జల’వర్చస్సు

వయసు తెలియనీయకుండా ఎంత తాపత్రయపడుతున్నా ముఖంపై ముడతలు వయసును దాచనీయకుండా బయట పెట్టేస్తుంటాయి. ఇవి కనపడకుండా చేయడానికి వయసుపైబడుతున్న మహిళలు క్రీములు, మేకప్‌లతో కప్పేసే ప్రయత్నం చేస్తుంటారు. బ్యూటీషియన్ల సలహాలతో ఫేషియల్‌ మసాజ్‌లు చేయించుకుంటారు. కానీ బ్రిటీష్‌కు చెందిన వైద్యులు ఇలాంటివేవీ అవసరం లేకుండా మంచినీటితో ముఖంపై ముడతలను అరికట్టవచ్చని భరోసా ఇస్తున్నారు. రోజులో ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగితే శరీరంలోని మలినాలన్నీ బయటికి వెళ్లి శరీరం ముడతలు రాకుండా కాపాడుతుందని చెపుతున్నారు. అందుకే జ్యూసులు తాగమని డైటీషియన్లు, బ్యూటీషియన్లు కూడా సూచిస్తారు. నీటితో పాటు శరీరానికి కావలసిన విటమిన్లు ఈ జ్యూసులు అందిస్తాయి కాబట్టే. నీరు తాగితే ముడుతలు రావనేది నిరూపణ చేయడానికి పరిశోధకులు కొంత మంది స్త్రీలకు వారి ఆహారపు అలవాట్లు, దినచర్యలలో ఎలాంటి మార్పులు లేకుండా, యధాతథంగా కొనసాగిస్తూనే రోజుకు ఎనిమిదిగ్లాసుల నీటిని తీసుకొమ్మని సలహా ఇచ్చారు. వీరిలో కొందరు సాధారణ నీటిని తాగగా, మరికొందరు స్వచ్ఛమైన మినరల్‌ వాటర్‌ను తాగారు.

అనంతరం వీరిని ఎనిమిది వారాల ముందు, తరువాత ఫొటోలను తీసి పోల్చి చూస్తే ట్యాప్‌ వాటర్‌ తాగిన వారి ముఖంపై ముడతలు 19 శాతం తగ్గితే, స్వచ్ఛమైన నీటిని తాగిన వారి ముఖంపై 24 శాతం ముడతలు తగ్గినట్టు గుర్తిం చారు. ఇలా ప్రతి రోజు నీరు తాగుతూ ముడతలు రాకుండా ఉండడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే మీ వయసు ఐదేళ్లు వెనక్కి వెళ్లిపోవడం ఖాయం. ్ద ఒక చెంచా తేనెలో ఒక చెంచా సెనగపిండి, చిటికెడు పసుపు, 5-6 చుక్కల ఆలివ్‌ ఆయిల్‌ కలుపుకోవాలి. ముఖం శుభ్రంగా కడుక్కొని ఈ మిశ్రమాన్ని రాసుకుని, 20నిమిషాల తరువాత చల్లని నీటితో కడగాలి. ఇలా వారానికి ఓ మారు చేస్తుండాలి. ్ద రెండు చెంచాల పచ్చిపాలు, ఒక చెంచా బాదంపౌడర్‌, ఒక చెంచా ద్రాక్ష రసాన్ని కలుపుకుని పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఇరవై నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. అనంతరం ముఖమంతా చేత్తో సుతిమెత్తగా తట్టాలి. దీంతో ముఖంపై ఏర్పడ్డ ముడతలు కొద్ది రోజుల్లోనే తగ్గుముఖం పడతాయి.