ముడతలకు దూరం

CUTE1
CUTE

ముడతలకు దూరం

కొందరికి చిన్నతనంలోనే ముడతలు వస్తాయి. అది వారి చర్మంలో తేమ లోపించటం వల్ల కావొచ్చు. వారి అలవాట్ల వలన రావొచ్చు. అంటే కొందరికి నొసలు చిట్లించడము, కనుబొమలు ఎగురవేస్తూ మాట్లాడటము అలవాటు. వీటి నివారణకు కొన్ని చిట్కాలు…

మొదట ఆ అలవాట్లను మానుకోవాలి. రోజూ యోగాసనాలు వేయండి. సమతులిత ఆహారం తీసుకోండి.

పాలమీగడలో ఆలివ్‌ ఆయిల్‌ కలిపి వంటికి మసాజ్‌ చేసుకుని గోరువెచ్చని నీటితో స్నానం చేయండి.

పెరుగుమీగడలో రోజ్‌వాటర్‌ నాలుగు చుక్కలు కలిపి ముఖానికి మసాజ్‌ చేయండి. ్జ రెండు బాదంపప్పులను నానబెట్టి తోలుతీసి పాలతో మారండి. ఆ నూరిన మిశ్రమంలో నాలుగు చుక్కలు గ్లిజరిన్‌ కలపండి. ఇప్పుడు ఆ పేస్టును ముఖానికి రాసి మసాజ్‌ చేయండి.

కోల్డ్‌క్రీమ్‌తో మసాజ్‌ చేసినా ముడతలు పోతాయి. వారానికి ఒకసారి కోల్డ్‌క్రీమ్‌తో మసాజ్‌ చేసుకుని ఎక్కువగా ఉన్నది దూదితో తుడిచివేయండి. ్జ బ్యూటీ ఆయిల్‌ తయారుచేసుకుని ముఖానికి రోజూ మసాజ్‌ చేస్తుంటే ముడతలు మటుమాయం.
బ్యూటీ ఆయిల్‌ చేసుకునే విధానం:
రెండు చెంచాల వేరుశనగనూనె, రెండు చెంచాల సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌, రెండు చెంచాల గులాబీనూనె, నాలుగు చుక్కలు శాండల్‌వ్ఞడ్‌ ఆయిల్‌ వీటిని అన్నిటినీ కలిపి సీసాలో ఉంచి రోజూ ఆ ఆయిల్‌ ముఖానికి మసాజ్‌కి వాడండి.