ముజఫర్‌నగర్‌ హింసకేసులో ఏడుగురికి జీవితఖైదు

muzafernagar
muzafernagar

ముజఫర్‌నగర్‌: ఉత్తరప్రదేశ్‌లోనిముజఫర్‌నగర్‌లో 2013 ఆగస్టుమాసంలోజరిగిన అల్లర్లకు సంబంధించి ఏడుగురు నిందితులకు జీవితఖైదు శిక్షను విధించారు. స్థానికకోర్టు విచారణపూర్తిచేసిన తర్వాత దోషులుగా ఏడుగురు నిందితులను నిర్ధారించింది. ఆనాటి అల్లర్లలో గౌరవ్‌, సచిన్‌ అనే ఇద్దరు చనిపోగా కావల్‌గ్రామంలో భారీఎత్తున విధ్వంసం చోటుచేసుకుంది. ఏడుగురు నిందితుల్లో ముజామ్మిల్‌, ముజస్సిమ్‌, ఫుర్కాన్‌, నదీమ్‌, జహంగీర్‌, అఫ్జల్‌, ఇక్బాల్‌ ఏడుగురు ఇద్దరు వ్యక్తులను హత్యచేసారని, కావల్‌గ్రామంలో 2013 ఆగస్టు 27వ తేదీ భారీ ఎత్తున విధ్వంసం సృష్టించారని ఆరోపించారు. అంతకుముందు రోజు ఏడుగురునిందితులు శిక్షార్హులేనని స్థానికకోర్టు నిర్ధారించింది. ఉత్తరప్రదేశ్‌లోని షామ్లి, ముజఫర్‌నగర్‌ జిల్లాల్లో హిందూ ముస్లిం మతాలమధ్య భారీ ఎత్తున అల్లర్లు చోటుచేసుకున్నాయి. మ్తొం 62 మంది చనిపోగా 93 మంది ఇతరులు తీవ్ర గాయాలపాలయితే 50వేలమందికిపైగా నిరాశ్రయులయ్యారు. ఒక చిన్నపాటిఘర్షణ రెండుమతాలమధ్య యువతలో చెలరేగిన ఘర్షణకు ముజఫర్‌నగర్‌లోని కావల్‌గ్రామంలో భారీ ఎత్తున విధ్వంసం జరిగింది. ఇటీవలికాలంలో ఉత్తరప్రదేశ్‌లో ఇదే అత్యంత ఘోరమైన హింసాకాండగా దర్యాప్తు అదికారులు పేర్కొన్నారు. 2013 దాడుల అరికట్టేందుకు భారత సైన్యాన్ని సైతం రాష్ట్రంలో నియమించారు. 20 ఏళ్లలో మొట్టమొదటిసారి సైనికసాయంతో అల్లర్లను అదుపులోనికితెచ్చారు.