ముగ్గురు విద్యార్థినుల ఆత్మ‌హ‌త్యాయ‌త్నం!

sucide attempt copy
sucide attempt

విజయవాడ: ముగ్గురు విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం సంఘ‌ట‌న జక్కంపూడిలో చోటుచేసుకుంది. స‌ద‌రు విద్యార్థులు కూల్‌డ్రింక్స్‌లో ఎలుకల మందు కలుపుకొని తాగారు. సకాలంలో ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. కాగా విద్యార్థినులు ఆటలు ఆడుతుండగా తోటి విద్యార్థులు ఫొటోలు తీశారు. ఆ ఫొటోలను మార్ఫింగ్‌ చేసి ఇంటర్నెట్‌లో పెడతామని బెదిరించారు. దీంతో భయపడిన ముగ్గురు విద్యార్థినులు ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.