ముగ్గురు బ్యాట్స్ మెన్లు పెవిలియ‌న్ బాట

india
india

ఆసీస్ బౌల‌ర్ల ధాటికి టీమిండియా టాపార్డ‌ర్ పేక‌మేడ‌లా కూలింది. ముఖ్యంగా కౌల్ట‌ర్ నైల్ వేసిన బంతుల‌ను ఆడ‌లేక ముగ్గురు బ్యాట్స్ మెన్లు పెవిలియ‌న్ బాట ప‌ట్టారు. టీం స్కోర్ 11 వ‌ద్ద వ‌రుస‌గా ర‌హానే(5), కోహ్లీ(0), పాండే(0)లు ఔట‌య్యారు. రోహిత్ శ‌ర్మ సైతం ఆసీస్ కెప్టెన్ స్మిత్ క్యాచ్ వ‌దిలేయ‌డంతో బ‌తికిపోయాడు. ప్ర‌స్తుతం భార‌త్ ప‌ది ఓవ‌ర్లు ముగిసే స‌రికి మూడు వికెట్లు కోల్పోయి 35 ప‌రుగులు చేసింది. రోహిత్ శ‌ర్మ (12), జాద‌వ్ (14) ప‌రుగుల‌తో క్రీజ్ లో ఉన్నారు. ఆసీస్ బౌల‌ర్ల‌లో కౌల్ట‌ర్ నైల్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఆసీస్ బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేయ‌డంతో స్కోరు బోర్డ్ నెమ్మ‌దిగా క‌దులుతుంది.