ముగిసిన మోడీ-కెసిఆర్ భేటీ

Narendra mody & KCR
Narendra mody & KCR

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ శనివారం సాయంత్రం సమావేశమైన విష‌యం విదిత‌మే. లోక్‌కల్యాణ్‌ మార్గంలోని ప్రధాని నివాసంలో ఈ భేటీ సుమారు 20 నిమిషాల పాటు సాగింది. ఈ సమావేశంలో 14 అంశాలపై ప్రధానితో చర్చించినట్లు తెలిసింది. ముందస్తు ఎన్నికలు, నూతన జోన్లకు ఆమోదం, పెండింగ్‌ ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. అలాగే ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు, బీసీ రిజర్వేషన్‌ బిల్లు, రక్షణ శాఖ భూములు రాష్ట్రానికి బదలాయింపు, ఐఐఐటీ, ఐఐఎం మంజూరు, కొత్త జిల్లాల్లో నవోదయ విద్యాలయాల ఏర్పాటు తదితర అంశాలు సీఎం కేసీఆర్‌, ప్రధాని మోదీతో చర్చించినట్లు తెలిసింది.