ముగిసిన ధ‌ర్మ‌పోరాట స‌భ‌

Chandrababu
Chandrababu

తిరుపతిః తారకరామ మైదానంలో నిర్వహించిన టిడిపి ధర్మపోరాట సభ ముగిసింది. టిడిపికి చెందిన పలువురు నేతలు ప్రసంగించారు. సీఎం చంద్రబాబునాయుడు ప్రధాని నరేంద్ర మోడీ 2014లో ఇచ్చిన హామీల వీడియోను ప్రజలకు చూపించారు. అనంతరం కేంద్రం రాష్ట్రానికి చేసిన నమ్మకద్రోహాన్ని వివరించారు. ప్రజలందరూ మోడీ వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు. పోరాటం ద్వారానే మనకు ప్రత్యేక హోదా వస్తుందన్నారు. కేంద్రం సహాయం చేయకపోయినా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు.