ముగిసిన కమింగ ఎక్సైజ్‌ కస్టడీ: చంచల్‌గూడ జైలుకు తరలింపు

mike kaminga
mike kaminga

హైదరాబాద్‌: డ్రగ్స్‌ వ్యవహారంలో ఆరెస్టైన నెదర్లాండ్స్‌ దేశస్థుడు మైక్‌ కమింగాను ఎక్సైజ్‌ అధికారులు చంచల్‌గూడ జైలుకు
తరలించారు. సినీ పరిశ్రమతో అనుబంధం కల్గి ఉన్న కమింగా నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు తమ కస్టడీకి
ఇవ్వాలని సిట్‌ న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేయడంతో మూడు రోజుల ఎక్సైజ్‌ కస్టడీకి అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే.
సోమవారంతో గడువు ముగియడంతో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అతన్ని జైలుకు తరలించారు. ఈ విచారణలో
సినీ పరిశ్రమతో కమింగకు ఉన్న సంబంధాలు, డ్రగ్స్‌ సరఫరా, ఎన్నేళ్లుగా ఈ కార్యక్రలాపాలు కొనసాగుతున్నాయనే ఆంశాలపై
ప్రశ్నించినట్లు సమాచారం.