ముక్కుపచ్చలారని చిన్నారిపై లైంగికవేధింపులు

Naveen gadke
Naveen gadke

ఇండోర్‌(మధ్యప్రదేశ్‌): అభంశుభం తెలియని ముక్కుపచ్చలారని చిన్నారిపై తమ మృగవాంఛను తీర్చుకున్నాడో కామాంధుడు. 12ఏళ్లలోపు చిన్నారులపై అత్యాచారంచేస్తే జీవితకాలంపాటు ఖైదు లేదంటే మరణశిక్ష తప్పదని చట్టసవరణలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపినరోజే ఈ సంఘటన వెలుగులోనికి వచ్చింది. 12ఏళ్లలోపువారికి అయితే జీవితఖైదు, 16 ఏళ్లలోపువారైతే జీవితకాలం శిక్ష, నిందితుడి నేర తీవ్రస్థాయిని బట్టి అవసరమైతే మరణశిక్ష విధించేందుకు చట్టాలు సవరించినా జరిగే ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి గంటకు నలుగురు మహిళలపై దేశంలో అత్యాచారాలు జరుగుతున్నట్లు జాతీయ క్రైమ్‌రికార్డులబ్యూరో స్పష్టంగా వెల్లడించింది. ఇక ఇండోర్‌ సంఘటనకు వస్తే ఎనిమిదినెలల చిన్నారి. జరుగుతున్నదేమిటో కూడా తనకు పూర్తిగా తెలియదు. అసలుల మాటలే సరిగ్గారాని చిన్నారిపైనే కన్నేసి మరీ ఓ కామాంధుడు తన పశువాంఛకు బలిచేసాడు. ఒక ఖాళీ బేస్‌మెంట్‌లో ఈచిన్నారిపై ఆఘాయిత్యానికి పాల్పడి ఆపై ఆమెను విసిరివేసాడు. సిసిటివికెమేరాలో ఈ చిన్నారిని తన భుజంపై వేసుకుని తీసుకెళుతున్న దృశ్యం కంటపడటంతో నిందితుణ్ణి పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. అత్యా చారంతోపాటు ఆబాలికను చంపేశాడని పోలీసులు సైతం దృవీకరించారు. పసికందు మృతదేహం సంఘటన జరిగిన ప్రాంతంలోనే బేస్‌మెంట్‌లో పడి ఉండగా గుర్తించి స్వాధీనంచేసుకున్నారు. అర్ధరాత్రిపూట జరిగిన ఈ అత్యాచారం తెల్లారాక ఒక షాప్‌కీపర్‌ చూడటంతో వెలుగులోనికి వచ్చింది. బేస్‌మెంట్‌లో ఉన్న తన షాపునుతెరుచుకునేందుకు వచ్చిన ఆ షాప్‌ఉద్యోగి మృతదేహాన్ని చూసి పోలీసులకు తెలియజేసాడు. ఈ పసికందు తల్లితండ్రులు బుడగలుఅమ్ముకుని జీవిస్తున్నారు. రాజ్‌వాడా కోటసమీపంలోని ఒక వీధిలో నిద్రిస్తుండగా పక్కనే ఉన్న పసికందుపై ఈ కామాంధుని కన్నుపడింది. నిందితునిపేరునవీన్‌ గడ్కే అని చెప్పారు. సిసిటివి ఫుటేజిలో నిందితునికి సంబంధించిన ఆధారాలు లభించడంతో పోలీసులకు దర్యాప్తు సులువయింది. నిందితుడు ఈ కుటుంబానికి సమీప బంధువని కూడా తేలింది. ఒక సైకిల్‌పై వచ్చి తెల్లవారుఝామున 4.45 గంటలకుఈ ప్రాంతానికి వచ్చి తల్లితండ్రుల పక్కనేనిద్రిస్తున్న ఈ బాలికను తీసుకుని లైంగికంగావేధించాడు. అత్యంతక్రూరమైన చర్యకు పాల్పడినట్లు సీనియర్‌ పోలీస్‌ అధికారి వెల్లడించారు. పోలీసులు రక్తపుచారికల్లో ఉన్న దుస్తులు, సైకిల్‌ను స్వాధీనంచేసుకున్నారు. బాలిక శరీరంలోని ప్రైవేటు భాగాల్లో కూడా తీవ్ర గాయాలయ్యాయి. నిందితుడు తన ఘనకార్యం ముగించిన తర్వాత బాలికను గ్రౌండ్‌లోనికి విసిరివేయడంతో తీవ్ర గాయాలయినట్లు చెపుతున్నారు.ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఈ సంఘటనపై తీవ్రంగా స్పందిస్తూ సమాజంలో ఇలాంటిఘోరాలను వెంటనే కట్టడిచేయాలని, నిందితుణ్ణి అరెస్టుచేశారని, అత్యంత సత్వరమే నిందితునికి శిక్షపడుతుందని అన్నారు. జమ్ముకాశ్మీర్‌లోని కతువాలో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం హత్యజరిగిన సంఘటనలు మరువకముందే ఈ సంఘటన చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ఈటాలో కూడా తొమ్మిదేళ్ల బాలికను ఒక పెళ్లి వేడుకకు వెళుతుండగానే ఆమెను అపహరించుకునిపోయి అత్యాచారంచేసి ఆపై ఉరితీసినట్లు చూపించారు. ఇదేవారంలో బుధవారం పదేళ్ల బాలికను అదేవిధంగా అత్యాచారంచేసి చంపేసారు. ఛత్తీస్‌ఘర్‌లో ఈసంఘటన చోటుచేసుకుంది. ఇక గుజరాత్‌లోని సూరత్‌లోసైతం 11 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి చంపేసారు. అంతేకాకుండా ఆ బాలిక శరీరంపై 86 తీవ్రగాయాలున్నట్లు పోలీసులు సైతం ధృవీకరించారు.