ముంబై క్ష‌త‌గాత్రుల‌కు సోనియా సానుభూతి

sonia gandhi
sonia gandhi

ముంబైః ముంబైలోని ఎల్పిన్‌స్టోన్ రైల్వేస్టేషన్‌ వంతెనపై ఈ రోజు తొక్కిస‌లాట జ‌రిగి 22 మంది మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మానవ తప్పిదం వల్లే ఇది జ‌రిగింద‌ని విమ‌ర్శించారు. రైల్వేల భద్రత ఏం బాగోలేద‌ని ఆమె అన్నారు. ప్రయాణికుల భద్రతకు సరైన ప్రణాళిక ఉంటే ఇటువంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా చూసుకోవచ్చ‌ని అన్నారు. క్ష‌త‌గాత్రుల‌కు వైద్య సదుపాయం అందేలా చూడాల‌ని సోనియా గాంధీ సూచించారు. అలాగే మృతుల కుటుంబాలకు అవసరమైన సాయం చేయాల‌ని అన్నారు. ఈ ఘటనపై ద‌ర్యాప్తు జరిపి, బాధ్యులైన వారిని గుర్తించాల‌ని అన్నారు. మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలుపుతున్న‌ట్లు పేర్కొన్నారు.