ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టుకు హార్థిక్ పాండ్యా గుడ్ బై?

Hardik Pandya
Hardik Pandya

ముంబై: ముంబై ఇండియన్స్‌జ‌ట్టుకు టీమిండియా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా రూపంలో పెద్ద షాకే త‌గిలింది. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 4న ప్రారంభం కానున్న ఐపీఎల్-11 మెగా వేలంలో పాల్గొనేందుకు పాండ్యా సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని పాండ్యా ఇప్పటికే బీసీసీఐకి వెల్లడించినట్టు స‌మాచారం. ముంబై ఇండియన్స్‌కు వీడ్కోలు చెప్పాలని పాండ్యా దాదాపు నిర్ణయించుకోవడం వల్లే వేలం పాల్గొనేందుకు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. గత సీజన్‌లు ముంబై ఇండియన్స్ తరపున ఆడిన పాండ్యా జట్టు విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన విష‌యం తెలిసిందే.