ముంబైలో మూడు రోజుల పాటు భారీ వ‌ర్షాలు

HEAVY RAIN
HEAVY RAIN

ముంబైః ఈ ఏడాది రుతుపవనాల ఆరంభానికి ముందే వరుణుడు కరుణించాడు. ఈ నెల 7వతేదీన రుతుపవనాలు ముంబైను తాకనుండగా దాని కంటే ముందే ముంబై నగరంలో రాబోయే మూడు రోజుల పాటు భారీవర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. శాంతాక్రజ్ ప్రాంతంలో ఆదివారం 26.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రుతుపవనాల ప్రవేశానికి ముందే ముంబై నగరంలో వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం చల్లబడింది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నగరంలో నాలాలు, డ్రైనేజీ పొంగి ప్రవహించకుండా ముంబై మున్సిపల్ అధికారులు అన్నిరకాల ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు.