ముందస్తు ఎన్నికలు వస్తే టిఆర్ఎస్దే విజయంః కెసిఆర్

నల్గొండః గుత్తా సుఖేందర్ రెడ్డి తన నల్గొండ ఎంపీ పదవికి రాజీనామా చేస్తారని, నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గానికి త్వరలోనే ఉపఎన్నిక జరగనుందనే విషయమై జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి రాజీనామా అంశంపై సీఎం కేసీఆర్ స్పందించారు. నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గానికి ఉపఎన్నిక వస్తుందో, రాదో తనకు తెలియదని, ఒకవేళ వస్తే, టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా,దాంతో ఉపఎన్నిక వస్తుందనే వార్తలు మీడియాలో హల్ చల్ చేస్తున్న తరుణంలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.