ముందంజలో భారత్‌ ప్రపంచ బ్యాడ్మింటన్‌

Saina Nehwal
Saina Nehwal

చైనా(నాన్‌జింగ్‌): బ్యాడ్మింటన్‌లో అత్యున్నత టోర్నీలో ఒకటైన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు దూసుకుపోతున్నారు. టోర్నీలో భాగంగా మహిళల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌ తర్వాతి రౌండ్‌లోకి అడగుపెట్టారు. తొలి రౌండ్‌లో బై లభించిన సైనా రెండో రౌండ్‌లో నేడు అలియె దెమిర్‌బంగ్‌(టర్కీ)తో తలపడింది. తొలి గేమ్‌లో మాత్రమే అలియె సైనాకు పోటీ ఇవ్వగలిగింది. రెండో గేమ్‌లో ప్రత్యర్థి చేతులెత్తయడంతో సులువుగా మ్యాచ్‌ను సొంతం చేసుకుది. ఈ మ్యాచ్‌లో సైనా 21-17, 21-8 తేడాతో విజయం సాధించి ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. అంతకుమునుపు శ్రీకాంత్‌ తొలి రౌండ్‌లో నాట్‌ నుయెన్‌(ఐర్లాండ్‌)తో తలపడ్డాడు. ఇద్దరి మధ్య అమీతుమీగా జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్‌ 21-15, 21-16 నుయెన్‌ను ఓడించి రెండో రౌండ్‌లో అడుగు పెట్టాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సాత్విక్‌ రంకిరెడ్డి-అశ్విని పొన్పప్ప జోడీ 10-21, 21-17, 21-18 తేడాతో జర్మనీ జోడీపై విజయం సాధించింది. మహిళల డబుల్స్‌లో జక్కంపూడి మేఘన-రామ్‌ పూర్వీష, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ప్రణ§్‌ు జెర్రీ-సిక్కీ రెడ్డి, రోహన్‌ కపూర్‌-కుహూ గార్గ్‌ పురుషుల డబుల్స్‌లో కోన తరుణ్‌-సౌరభ్‌శర్మ జోడీ, అర్జున్‌-రామచంద్రన్‌ జోడీలు ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించాయి.