ముంచుకొస్తున్న మంచినీటి ముప్పు!

water

వర్షాభావంతో భూగర్భజలాలు అడుగంటడం, మరొకపక్క చిన్నాపెద్ద నీటి వనరులన్నీ నీరు లేక నోళ్లెలబెట్టడంతో మంచినీటికి తీవ్రకొరత ఏర్పడే ప్ర మాదం ఉందనే హెచ్చరికలు వెలువడుతున్నాయి. ఇప్ప టికే అనేక పట్టణాల్లో రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి, మరికొన్ని పట్టణాల్లో అయితే ఐదు రోజులకు ఒకసారి మంచి నీళ్లు సరఫరా చేస్తున్నారు. వేసవి ఆరంభం కాకముందే ఈ పరిస్థితి ఉంటే మార్చి నుండి ఎలాఉంటుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలోనూ, ఆంధ్రప్రదే శ్‌లోని రాయలసీమ కోస్తాజిల్లాల్లోని మెట్టప్రాంతాల్లో ఇప్పటికే మంచినీటికి ప్రజలు ఇబ్బందులుపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. భూగర్భజల మట్టాలు దారుణంగా దిగజారిపోతున్నాయని భూగర్భజల శాఖ అధికారులే అంచనాలు వేస్తున్నారు. వారి లెక్కల ప్రకారం ఉభయ రాష్ట్రాల్లో దాదాపు ముప్పై లక్షలకుపైగా బోరుబావులున్నాయి.అనధికారికంగా మరో ఐదు లక్షలకుపైగా ఉండొ చ్చు అంటున్నారు.ఏడాదికేడాది ఈ బోరుబావుల సంఖ్య పెరిగిపోతున్నది. జిల్లాల్లో 80 శాతం పైగా వ్యవసాయానికి మరో 20 శాతం వరకు పరిశ్రమలకు తాగు నీటి అవ సరాలు తీర్చడానికి బోరుబావులను ఉపయోగించుకుంటున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా మీటర్ల కొద్దీ జలమట్టం పడిపోతున్నది. దీనికితోడు భూగర్భ జలాలను అవసరానికి మించి వాడకం జరుగుతుందనేది నిర్వివాదం.ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగాఏటా దాదా పు 250 ఘనపు కిలోమీటర్ల మేర భూగర్భజలాలను భారతదేశంలో వినియోగిస్తున్నట్లు రికార్డులే వెల్లడిస్తు న్నాయి.ఎలాంటి నియంత్రణలు లేకుండా నిరాటంకం గా ఈ వినియోగం జరిగిపోతున్నది. ఏటా అదనంగా 30-40వేల బోరుబావులు తవ్వతున్నట్లు అధికార వర్గాలే వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా అధికార లెక్కల ప్రకా రమే 6,572 భూగర్భజల బ్లాకులు ఉండగా వాటిలో మూడోవంతుకుపైగా బ్లాకుల్లో అవసరానికి మించి వాడుతున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మిగితా బ్లాకు లు ఆ పరిధిలోకి చేరుకొని దేశంలో భూగర్భజలాలు మ రింత అడుగంటే ప్రమాదం ఉందని నిపుణులు చేస్తున్న హెచ్చరికను పట్టించుకున్న దాఖలాలు కన్పించడంలేదు.

దేశంలో బోరుబావుల సంఖ్య గత అరవైఏళ్లలో 130 రెట్లు పెరిగి దాదాపు మూడు కోట్లకు చేరుకున్నట్లు అం చనా. ఇందువల్ల రైతులకు కొంత ఉపయోగపడినా నీటి సంరక్షణ పద్ధతులు పాటించకపోవడంవల్ల అనేక అనర్థాలకు దారితీస్తుందనేది నిపుణుల వాదన. పంజాబ్‌లో 75శాతం, రాజస్థాన్‌లో 60శాతం, కర్ణాటక, తమిళనాడు లో 40శాతం అధికంగా భూగర్భజలాలు వాడుకుంటు న్నారు. ఇలాంటి పరిస్థితలే కొనసాగితే మరో ఇరవై ఏళ్ల లో దేశజలవనరులలో 60 శాతం హరించుకుపోతాయ ని ఇటీవల ఒకసర్వే నివేదిక హెచ్చరించింది. భూగర్భజ లాలను కాపాడేందుకు త్రికరణశుద్ధిగా ప్రయత్నాలు జర గడంలేదు. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 2002 లోనే జల,భూ,వృక్షచట్టం (వాల్టా)తెచ్చారు. కాని అమలు లో మాత్రం అధికారగణం ఏ మాత్రం శ్రద్ధ తీసుకోవడం లేదు. తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇంకుడుగుంతల పథకాన్ని ప్రవేశపెట్టా రు. భూగర్భజల మట్టాలను పెంచేందుకు ఇది ఎంతగా ఉపయోగపడుతున్నా ఆచరణకు వచ్చేసరికి అంతంత మాత్రంగానే మిగిలిపోయింది. దీనికితోడు చెరువులు, కుంటలు అదృశ్యం కావడం కూడా ఈ జలవనరుల కొర తకు కారణంగా చెప్పొచ్చు. భవిష్యత్తులో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు తెలంగాణ ప్రభు త్వం మిషన్‌ కాకతీయ పథకం పేరుతో చేపట్టిన చిన్న నీటివనరుల మరమ్మత్తుల కార్యక్రమంచేపట్టింది. ఇందు వల్ల భూగర్భజలాలు బాగా పెరిగే అవకాశాలున్నాయి.

తెలంగాణాలోని మొత్తం దాదాపు 45వేల చిన్ననీటి వనరులలో పూడికలుతీసి మరమ్మత్తులుచేసే కార్యక్రమం దశలవారీగా చేపట్టారు.ఇవి నిర్ణీత గడువ్ఞ ప్రకారం పూర్తి అయితే చాలా వరకు సమస్యకు పరిష్కారం లభిస్తుంది. దీనికితోడు ఇంటింటికి నల్లాలద్వారా నీరిచ్చే కార్యక్రమం కూడా ఎంతో దోహదపడుతుంది.అందులో మరో వాద నకు తావులేదు. ఇది మంచినీటి సమస్య పరిష్కారానికి దీర్ఘకాలిక ప్రణాళిక. కాని రేపురాబోయే వేసవిలో మంచి నీటి సమస్య పరిష్కరించడానికి తాత్కాలికంగా నీటిసర ఫరా చేపట్టాలి. ఇప్పటికే అత్యధిక నగర పంచాయితీల్లో రెండుమూడు రోజులకుఒకసారి నీటిసరఫరా అవుతుం ది. గ్రామీణ ప్రాంతాల పరిస్థితి మరింత దుర్భరంగా ఉంది. నవంబరు చివరి వారంలోనే కిలోమీటర్ల కొద్దీ నడిచివెళ్లి బిందెడు నీళ్లు తెచ్చుకోవాల్సిన దుస్థితిలో వేలాది గ్రామాలున్నాయి. ఇదిఇలావుండగా మంచినీటి వ్యాపారం చేస్తున్న కంపెనీలు, ప్రైవేట్‌ వ్యక్తులు ఇప్పటి నుంచే పావ్ఞలు కదుపుతున్నారు. పట్టణాల్లోనే కాదు గ్రామాలు, కుగ్రామాలు సైతం ఆటోల్లో మంచినీరు సర ఫరా కార్యక్రమం నిరాటంకంగా జరుగుతున్నది. అయితే వారు సరఫరా చేస్తున్న నీరు ఎంతవరకు స్వచ్ఛమైనవో తెలిసే అవకాశాలు లేకుండా పోతుంది. ఈ నీటివ్యాపా రంపై ఎలాంటి నియంత్రణ నిబంధనలు లేకపోవడంతో ఎక్కడికక్కడ నీటిని ప్యూరిఫై చేసే ప్లాంట్లు వెలుస్తు న్నాయి. ఉభయరాష్ట్రాల్లో దాదాపు 20వేలకోట్ల రూపా యలపైగా మంచినీటివ్యాపారం జరుగుతున్నట్లు అనధి కార అంచనా. పాలకులు ఇప్పుడైనా రాబోవు సమస్యను దృష్టిలో ఉంచుకొని పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.