మీ భాగస్వామి కులాసాయేనా?

COUPLE-1
COUPLE-1

మీ భాగస్వామి కులాసాయేనా?

వైవాహిక జీవితంలో భార్యాభర్తల్లో ఒకరి మనస్తత్వం, గుణగణాలు, ఆరోగ్యం మొదలైన అన్ని విషయాలు వారిపై ఎంత ప్రభావం చూపిస్తాయో, రెండవవారిపై కూడా అంతే ప్రభావం చూపుతాయి. అందుకే వైవాహిక జీవితం ఆనందమయం కావాలంటే ఒకరు సంతోషంగా ఉంటే చాలదు. రెండవవారి జీవితానందం బాధ్యతలను కూడా తీసుకోవాలి. భార్య అయినా, భర్త అయినా రెండవ వారి పట్ల ఈ కింది బాధ్యతలు చూపించాలి- ్య మీ జీవిత భాగస్వామి మానసిక స్థితిలో మార్పులు ఉంటే జాగ్రత్తగా గమనించండి. భార్యాభర్తల్లో ఎవరు వింతగా, కొత్తగా ప్రవర్తించినా అది ముందుగా తెలిసేది రెండవ వారికే. ఆ తేడా ఎందుకు వచ్చిందో, దానికి కార ణాలు ఏమిటో తెలుసుకోండి.

దీర్ఘకాలంగా మీ జీవిత భాగస్వామి జీవితంలో సంపూర్ణ ఆనందం అనుభవించనట్టు మీకనిపిస్తే మీరు ఆ విషయం మీద శ్రద్ధ పెట్టాలి. మీ భార్య లేదా భర్తలో జీర్ణశక్తికి సంబంధించిన సమస్యలు, మార్పులు వచ్చినట్టు అనిపిస్తే, వారి బరువులో తేడా కనబడుతుంటే కారణమేమిటో తెలుసుకునే ప్రయత్నం చేయండి.

నిద్రకి సంబంధించిన సమస్యలు రెండవ వారిలో కనబడుతుంటే- బాగా ఎక్కువ నిద్రపోతున్నట్టు అనిపించినా లేదా నిద్రలేమితో బాధపడుతున్నా వారి సమస్యలో మీరూ పాలు పంచుకోవాల్సిన అవసరం ఉంది. తరచుగా కోపాన్ని వ్యక్తం చేస్తున్నా. వారి సహజత్వానికి భిన్నంగా కోపం ఆవేశం ప్రదర్శిస్తున్నా విషయం ఏమిటో ఆరా తీయండి.

తరచుగా అలసటకు గురయినట్టు వారు భావిస్తున్నా, శక్తి కోల్పోయినట్టు నీరసంగా ఉంటున్నా… వారు అనవసరంగా అపరాధ భావానికి గురవుతున్నా, తాము అసమర్ధులు ఎందుకు పనికిరానివారు అనుకుంటూ బాధని, నిరాశని వ్యక్తం చేస్తున్నా… వారిలో ఇది వరకటిలా ఏకాగ్రత లేకపోయినా…చేస్తున్న పనిపట్ల శ్రద్ధ లేకుండా నిరాసక్తత ప్రదర్శిస్తున్నా.

మరణం, ఆత్మహత్యకు సంబంధించిన మాటలు వారు తరచుగా మాట్లాడుతున్నా నిర్లక్ష్యం చేయకుండా వారి మనసులో ఉన్న భావాలు కనుక్కునే ప్రయత్నం చేయండి.