మీసం తిప్పటం మరువకు

SACHIN TWEETS
SACHIN TWEETS

మీసం తిప్పటం మరువకు

-సచిన్‌ బర్త్‌డే గ్రీటింగ్స్‌

మంగళవారం 32వ పుట్టినరోజు జరుపుకుంటున్న శిఖర్‌ ధావన్‌కు క్రికెట్‌ దిగ్గజం సచ్చిన్‌ శుభాకాంక్షలు తెలిపారు.. పుట్టినరోజు సందర్భంగా శిఖర్‌కు పలువురు క్రికెటర్లు అభినందనలు తెలిపారు.అభిమానులు పెద్దమొత్తంలో సోషల్‌ మీడియాలో ధావన్‌కు శుభాకాంక్షలు వెల్లడించారు..  ధావన్‌ మీసం తిప్పటం మనం చాలాసార్లు చూసే ఉంటాం.. ధావన్‌ చేసే ఆ పనిని ప్రధానంగా తీసుకున్న సచిన్‌.. హ్యాపీ బర్త్‌డే ధావన్‌.. నువ్వు ఇలాగే ధైర్యంగా ఆట కొనసాగించాలని కోకుతున్నా.. అలాగే నీ మీసం తిప్పటాన్ని మాత్రం మర్చిపోకు .. అంటూధావన్‌ మీసం తిప్పుతున్న ఫొటోను పెట్టి సచిన్‌ ట్వీట చేయటం విశేషం.. కాగా సచిన్‌తో పాటు ఐసిసి, బిసిసిఐ , వీరేందర్‌ సెహ్వాగ్‌, రోహిత్‌ శర్మ, హర్బజన్‌ సింగ్‌, హేమంగ్‌ బడానీ తదితరులు ధావన్‌కు సోషల్‌ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.