మీడియా సంస్థలకు కోర్టు జరిమానా

Delhi High Court
Delhi High Court

న్యూఢిల్లీ : కథువా అత్యాచార బాధితురాలి వివరాలను బహిర్గతం చేసిన మీడియా సంస్థలకు ఢిల్లీ హైకోర్టు జరిమానా విధించింది. జమ్మూ కాశ్మీర్‌లోని కథువాలో ఇటీవల 8 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేశారు. ఆ ఘటనపై వార్తలు రాస్తూ అనేక మీడియా సంస్థలు బాధితురాలి పేరును, ఫోటోలను ప్రచురించారు. దీన్ని ఢిల్లీ హైకోర్టు తప్పు పట్టింది. అత్యాచార బాధితుల కోసం ఏర్పాటు చేసిన నిధి కోసం 10 లక్షల జరిమానా చెల్లించాలని ఆ మీడియా సంస్థలను కోర్టు ఆదేశించింది. మీడియా తప్పు ఒప్పుకోవడంతో కోర్టు జరిమానా విధించినట్లు తెలుస్తున్నది.