మీడియాపై నవదీప్‌ ఫైర్‌

Hero Navdeep-1

హైదరాబాద్‌: డ్రగ్స్‌ కేసులో విచారణను ఎదుర్కోంటున్న నటుడు నవదీప్‌ సిట్‌ విచారించిన విధానంపై
మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసార మాధ్యమాల్లో ప్రసారమవుతున్న
విజువల్స్‌ తనను విస్మయానికి గురి చేశాయన్నారు. విచారణ కొనసాగుతుండగా కల్పిత కథనాలు, అందిన
సమచారం అంటూ ఇష్టానుసారంగా రాయడం సబబు కాదని ట్వీట్‌ చేశారు. సోమవారం విచారణలో భాగంగా
ఆయన్ను ప్రశ్నించారు. డ్రగ్స్‌ నిర్థారణలో గోరు, రక్త నమూనాలు సిట్‌ అధికారులు కోరగా నవదీప్‌ నిరాకరించిన
విషయం తెలిసిందే.