మిష‌న్ భ‌గీర‌థ దేశంలోనే పెద్ద స్కాంః జీవన్ రెడ్డి

Jeevan reddy
Jeevan reddy

హైద‌రాబాద్ః టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ దేశంలోనే పెద్ద స్కాం అని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపించారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. మిషన్ భగీరథపై న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తాగునీరు పేరుతో రూ. 40వేల కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఎటుపోయాయి? అని జీవన్ రెడ్డి, సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు.