మిలిటరీ పోలీసులుగా మహిళల నియామకం

Bipin Ravath
Bipin Ravath

మిలిటరీ పోలీసులుగా మహిళల నియామకం

న్యూఢిల్లీ: మిలిటరీ పోలీసులుగా మహిళలను నియమించనున్నట్టు ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ అన్నారు .సాయుధ దళాలలో ఇతర అవకాశాలపై నిర్ణయం తీసుకోవటానికి ముందు మహిళలను మిలిటరీ పోలీసులుగా నియమిస్తామని ఆయన చెప్పారు. తొలిదశలో మహిళలను మిలిటరీ పోలీసులుగా నియమిస్తామని , తర్వాత ఇతర సాయుధ విభాగాల్లో నియామకాలపై దృష్టిసారిస్తామని చెప్పారు.. శనివారం ఇక్కడ జరిగిన పాసింగ్‌ఔట్‌ పెరేడ్‌లో ఆయన పాల్గొన్నారు.. అనే సందర్బఆల్లో ప్రజలు ఆందోళనలు చేపట్టినపుడు తాము నిర్వహించే ఆపరేషన్ల సమయంలో ప్రజలను ఎదురొకనావల్సి వస్తుందని, ముఖ్యంగా మహిళలు ముందు వరుసలో తమకు తటస్తపడుతుంటారని అన్నారు.. దీనిని సమర్ధంగా ఎదుర్కొనటానికి మహిళల నియామకం ఎంతో అవసరమని ఆయన అన్నారు.
==============