మిలటరీ ఆపరేషన్‌కు సిద్దమవుతున్న చైనా?

china army
china army

చైనా: డోక్లామ్‌ సరిహద్దు వివాదంతో ఇప్పటికే రగిలిపోతున్న చైనా తాజాగా సరిహద్దుల్లో మోహరించిన భారత సైన్యాన్ని
తరిమి కొట్టేందుకు మిలటరీ ఆపరేషన్‌కు సిద్దమవుతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని చైనా అధికారిక పత్రిక ‘గ్లోబల్‌
టైమ్స్‌ తన కథనంలో పేర్కొంది. చైనా భూభాగంలోకి భారత సైనికుల చొరబాటును తమ దేశం ఎక్కువ కాలం భరించలేదని,
భారత సైనికులు వెనక్కి తగ్గకపోతే మరో రెండు వారల్లోగా ఓ చిన్న స్థాయి మిలటరీ ఆపరేషన్‌కు తమ దేశం సిద్దమవుతుందని
తన కథనంలో హెచ్చరించింది.