మిర్యాలగూడలో దారుణహత్య

PRANAY
PRANAY

-హత్యకు ప్రేమ వివాహమే కారణం
-నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు: ఎస్‌పి
మిర్యాలగూడ క్రైం: పట్టపగలే యువకుడు దారుణ హత్య జరగడంతో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జనసంచారం అధికంగా ఉండే స్థానిక జ్యోతిహాస్పిటల్‌ ఎదుట స్థానిక వినోభనగర్‌కు చెందిన పెరుమాళ్ల ప్రణ§్‌ు తన భార్యను వైద్య పరీక్షలు నిమిత్తం అసుపత్రికి తీసుకవచ్చిన యువకుడిని అందరు చూస్తుండగానే అఘాంతకుడు ఒక్కసారిగా కత్తితో దాడి చేయగా తీవ్రంగా గాయపడి అధిక రక్తస్రావమవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితుడు మాటు వేసి వెనుక నుండి పదునైన కత్తితో దాడి చేయడంతో మృతుని పక్కనే ఉన్న తల్లి ప్రేమలత, భార్య అమృతలు అసుపత్రిలోకి పరుగులు తీశారు. హత్యోదంతం తెలిసిన వెంటనే జనం ఘటన స్థలానికి తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్‌పి ఎ.వి.రంగనాథ్‌ సంఘటనాస్థలానికి చేరుకొని సంఘటన తీరుపై పోలీసులు, ప్రత్యక్షసాక్షులైన భార్య, మృతుని తల్లిని అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం ఏరియా అసుపత్రికి తరలించారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలుగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.
నిందితులెవరైనా ఉపేక్షించేది లేదు: ఎస్‌పి
మిర్యాలగూడ పట్టణంలోని వినోభనగర్‌కు చెందిన పెరుమాళ్ల ప్రయణ్‌ హత్యకు పాల్పడిన నిందితులెవరైనా ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్‌పి ఎ.వి.రంగనాథ్‌ అన్నారు. శుక్రవారం స్థానిక ఏరియా అసుపత్రిలో విలేకర్లతో మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణానికి చెందిన స్థిరవ్యాపారి, బిల్డర్‌ అయిన తిరునగరు మారుతిరావు కుమార్తె అమృతను హత్యకుగురైన ప్రణ§్‌ు జనవరి నెలలో కులాంతర వివాహం చేసుకున్నట్లు తెలిపారు. మారుతిరావు నుండి తమకు ప్రాణహని ఉందని ప్రేమికులు ఇరువురు పోలీసులను అశ్రయించడంతో మార్చి నెలలో అతనిని పిలిపించి హెచ్చరించడం జరిగిందన్నారు. దీనిని జీర్ణించుకోలేక యువతి తండ్రి పట్టణంలోని వినోభనగర్‌కు చెందిన పెరుమాళ్ల బాలస్వామి-ప్రేమలత ప్రథమకుమారుడైన మృతుడు ప్రణ§్‌ుపై కక్ష పెంచుకొని అతని అంతమొందించేలా పథకం పన్నాడన్నారు. పథకంలో భాగంగా ఈ హత్య జరిగిందని, దీనికి మారుతిరావు కారణమనే కోణంలో విచారణ జరుగుతుందన్నారు. సంఘటన స్థలానికి పోలీసులు జాగీలాలను రప్పించి నిందితుని అచూకీ కొరకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. హత్యకు కారణమని భావిస్తున్న అనుమానితుడు మారుతిరావు అచూకీ తెలిసినట్లయితే తమకు సమాచారం అందించాలన్నారు. అయన వెంట డిఎస్‌పి శ్రీనివాస్‌, సిఐలు అదిరెడ్డి, ధనుంజ§్‌ుగౌడ్‌, ఎస్‌ఐలు నాగరాజు, యాదయ్యలున్నారు.