మినిమం బ్యాలెన్స్‌ లేకుంటే పెనాల్టీ వసూలు

sbi
sbi

మినిమం బ్యాలెన్స్‌ లేకుంటే పెనాల్టీ వసూలు

న్యూఢిల్లీ: స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా లో మినిమం బ్యాలెన్స్‌లేకుంటే పెనాల్టీ వసూలు చేసే విధానం ఈనెల 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది.. ఎటిఎంల్లో సహా అనిన రకాల బ్యాంకు సర్వీసుల చార్జీలు కూడ నేటి నుంచి పెరిగాయి.. ఈ కొత్త చార్జీలు ఇటీవలే ఎస్‌బిఐలో విలీనమైన మహిళా బ్యాంకుతో సహా 5 బ్యాంకులకు కూడ వర్తిస్తాయి.. బ్యాంకు ఖాతాదారులు నెలలో మూడు సార్లు మాత్రమే ఉచితంగా నగదు డిపాజిట్‌ చేసుకోవచ్చు.. అంతకుమించితే ప్రతి లావాదేవీకి రూ.50 లెవీ, సర్వీసు టాక్స్‌ కలిపి వసూలు చేస్తారు.. కరెంట్‌ అకౌంట్లలో ఈ పెనాల్టీ రూ.20 వేల వరకూ కూవ వసూలు చేయవచ్చు..దేశంలోని ఆరు మెట్రో నగరాల్లో మినిమం బ్యాలెన్స్‌ 5వేలు ఉండాలి.. సేవింగ్స్‌ బ్యాంకు ఖాతాదారుల అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్‌ లేకపోతే గ్రామీణప్రాంతాల్లో రూ.20, మెట్రో శాఖల్లో రూ.100 పెనాల్టీగా వసూలు చేస్తారు.. ఈ చార్జీలకు సంబంధించి వివరాలను ఎస్‌బిఐ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.