మిథాలీ, హర్మన్‌ప్రీత్‌లకు రైల్వే శాఖ పదోన్నతి

mithali-raj-harmanpreet
mithali-raj-harmanpreet

ఢిల్లీ: మహిళల వన్డే ప్రపంచ కప్‌లో అద్భుత ప్రతిభ కనబర్చిన మిథాలీ సేనకు ఇప్పటికే నజరానా రూపంలో భారీగా నగదు వస్తున్న
సంగతి తెలిసిందే. తాజాగా రైల్వేశాఖ కూడా దీనిలో చేరింది. భారత జట్టు సభ్యులకు కోటి రూపాయల నజరానాను ప్రకటించింది.
అలాగే ప్రస్తుత జట్టులో తమ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించనున్నట్లు మంత్రి సురేశ్‌ప్రభు గతంలోనే ప్రకటించారు. ఈ క్రమంలోనే
జట్టు కెప్టెన్‌ మిథాలీకి, వైస్‌ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌కౌర్‌కు గెజిటెడ్‌ అధికారులుగా పదోన్నతి కల్పించనున్నట్లు రైల్వేశాఖ అధికారులు తెలిపారు.
అంతేకాకుండా రైల్వేశాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న పది మంది అమ్మాయిలకు కలిపి రూ.1.30 కోట్లను అందజేయనున్నట్లు
ప్రకటించింది.