మిత్రుడి కుమారుడి వివాహనికి వెళ్తే తప్పేంటి?: కేసీఆర్‌

TSCM Kcr
TSCM Kcr

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల అనంతపురంలో జరిగిన ఆంధ్రప్రదేశ్‌ మంత్రి పరిటాల సునీత కుమారుడి  వివాహ వేడుకల్లో పాల్గొని, అనంతరం పరిటాల రవి సమాధి వద్ద నివాళులు ఆర్పించిన సంగతి తెలిసిందే. అయితే  దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించిన నేపథ్యంలో కేసీఆర్‌ స్పందించారు. పరిటాల రవి తనకు ఆత్మీయుడని, మిత్రుని కుమారుడి వివాహనికి వెళ్తే తప్పెంటాని ఆయన ప్రశ్నించారు. అలాగే తాను గతంలో అనంతపురం జిల్లాకు  ఇన్‌చార్జ్‌ మంత్రిగా కూడా పనిచేశారని ఆయన అన్నారు.