మిడిల్‌ క్లాస్‌ క్యారెక్టర్‌

RAJTARUN
RAJTARUN

గత ఏడాది రారండోయ్‌ , హలో వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌, తాజాగా రాజ్‌తరుణ్‌ హీరోగా చిత్ర శుక్లా హీరోయిన్‌గా శ్రీరంజనిని దర్శకురాలిగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న చిత్రం రంగులరాట్నం. ఈచిత్రం ప్రస్తుతం సెన్సార్‌ జరుపుకుంటోంది. ఈనెల 14న సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా ఈచిత్రం రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈసందర్భంగా హీరో రాజ్‌తరుణ్‌తో ఇంటర్వ్యూ విశేషాలు..

రంగుల రాట్నం సినిమా గురించి?
కుటుంబం మొత్తం కలిసి చూడదగ్గ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఈసినిమా. మదర్‌ సెంటిమెంట్‌ బాగా వర్కవుట్‌ అయ్యింది. ఈ సంక్రాంతికి మా సినిమా థియేటర్లకు రాబోతోంది.

సినిమా నేపథ్యం?
అందరికీ కనెక్ట్‌ అయ్యే కథ ఇది. లవ్‌స్టోరీ తోపాటు చిన్నచిన్న ఎమోషన్స్‌ ఈ సినిమాలో బాగా పండాయి.

మీ పాత్ర?
ఒక మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి క్యారెక్టర్‌ నాది. బాధ్యతలు తక్కువ ఉన్న పాత్ర ఇది. నాలుక్‌ ఈ సినిమాలో సహజంగా ఉంటుంది. అందరిలా సరదాగా కన్పిస్తాను.

అన్నపూర్ణ బ్యానర్‌ గురించి?
ఇంత పెద్ద బ్యానర్‌లోరెండోసారి వర్క్‌ చేయటం చాలా హ్యాపీగా ఉంది. నేను తప్ప ఈ సినిమాలో నటించిన ఇతర నటీనటులు దాదాపు కొత్వఆరే. ఎక్కడా రాజీపడకుండా సినిమాను నిర్మించారు.

మీ సినిమా సంక్రాంతికి రావటం గురించి?
ప్రతి సంక్రాంతికి మూడునాలుగు సినిమాలు విడుదల కావటం సహజం. పండక్కి కుటుంబం అంతా కలిసి చూడదగ్గ సినిమా మాది.. మా సినిమా వేరే సినిమాలకు పోటీ అని నేను భావించను.

కథలో మీకు నచ్చిన అంశం?
అబ్బాయిలకు, అమ్మాయిలకు ఈసినిమా ఎక్కడో ఒకచోట కనెక్ట్‌ అయ్యేలా ఈసినిమా ఉండబోతోంది. ఆ పాయింట్‌ నచ్చి ఈ సినిమా చేయటానికి ఒప్పుకున్నాను.

రంగుల రాట్నం టైటిల్‌?
జీవితం రంగుల రాట్నం లా తిరుగుతూ ఉంటుంది. మా సినిమాలో హీరో జీవితం కూడ అంతే. కథకు తగ్గ టైటిల్‌ అని భావించి ఈ టైటిల్‌ను ఫిక్స్‌ చేయటం జరిగింది.

డైరెక్టర్‌ గురించి?
మా సినిమా లేడీ డైరెక్టర్‌ చేసినా అబ్బాయి మనస్తత్వం అంత బాగా అర్ధం చేసుకుని సినిమా తెరకెక్కించారు. సెల్వరాఘవన్‌ వద్ద దర్శకత్వ శాఖలో వర్క్‌ చేశారామె. తనకు కావాల్సింది తను బాగా రాబట్టుకుంది.

సినిమా విడుదల తేదీ?
ఈచిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సెన్సార్‌ పూర్తి అయ్యాక విడుదల తేదీని ప్రకటిస్తాము.