మిజోరమ్‌ సిఇఒ పోస్టుకు ముగ్గురు ఐఎఎస్‌ల జాబితా

MIZORAM
MIZORAM

కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిన రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీ
ఐజ్వాల్‌: మిజోరమ్‌ ముఖ్య ఎన్నికల అధికారిగా రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సీనియర్‌ఐఎఎస్‌ అధికారుల పేర్లను కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదివారం పంపించింది. రాష్ట్రంలో ముఖ్య ఎన్నికల అధికారిని తక్షణమే తప్పించాలని లేనిపక్షంలో ఎన్నికలు సజావుగా సాగవన్న డిమాండ్‌ పెల్లుబికిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాని ముగ్గురు అధికారుల పేర్లను సూచించాలని, వారిలో అర్హతలున్నవారిని ప్రస్తుత సిఇఒ ఎస్‌బి శశాంక్‌స్థానంలో నియమించగలమని తెలియజేసింది. ఎన్నికలు జరగనున్న మిజోరమ్‌లో సిఇఒను బదిలీచేయాలని రాజకీయంగా దుమారం లేచింది. ముగ్గురు అధికారులు లాల్మ్‌మింగ్‌తంగా, హెచ్‌నాలేంగ్‌మావియా, కె.లాల్‌థనవామ్మావియాలపేర్లను పంపించినట్లు తెలిసింది. డిప్యూటి ఎనినకల కమిషనర్‌ సుదీప్‌జైన్‌ ప్రస్తుతం ఇసిటీమ్‌లో రెండో ఎన్నికల కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇందుకోసం కొత్త సిఇఒను ఎంపికచేయడానికి రెండుమూడురోజులు వ్యవధి పడుతుందని అన్నారు. ఎన్‌జిఒ కోఆర్డినేషన్‌ కమిటీ నాయకులతో సుదీప్‌జైన్‌మాట్లాడుతూ శశాంక్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం నడిచిందని, సిఇఒను వెంటనే మార్చాలని, త్రిపురలోనిసహాయ శిబిరాల్లో ఉంటున్న వారికి మిజోరమ్‌లో ఓట్లు వినియోగించుకునే హక్కులు ఉండాలని, ఎన్‌జిఒ సంస్థ డిమాండ్‌చేసింది. మిజోరమ్‌ సిఇఒ విషయమై ప్రత్యామ్నాయంగా చర్యలుచేపట్టేందుకు ఎన్నికల సంఘం నిర్ణయించింది. వెంటనే మిజోరమ్‌ చీఫ్‌ సెకక్రటరీనుంచి ముగ్గురు సీనియర్‌ ఐఎఎస్‌ అదికారుల పేర్లు వెళ్లాయి.ప్రస్తుత ఎన్నికల అధికారి శశాంక్‌ పదేపదే కేంద్ర సాయుధ బలగాలను దించేందుకు ప్రయత్నించారని, ఈశాన్యరాష్ట్రంలో మాజీ ప్రధాన కార్యదర్శి లాల్‌నుమన్‌మావియా చువాంగో ఎన్నికల ప్రక్రియలో పదేపదే జోక్యంచేసుకుంటున్నారని ఆరోపించారు. చువాంగో మిజోరమ్‌ నివాసి గుజరాత్‌కేడర్‌ ఐఎఎస్‌ అధికారిగా ఉన్నారు. ఈనెలలోనే ఆయన బాద్యతలనుంచి రిలీవ్‌ అయ్యారు. ఎన్‌జిఒ కోఆర్డినేషన్‌ కమిటీపేరిట ఆందోళనకారులు వెంటనే సిఇఒను తొలగించాలని పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. బుధవారమే శశాంక్‌ మిజోరమ్‌నుంచి వెళ్లిపోయారు. ఢిల్లీలో ముఖ్య ఎన్నికల కమిషనర్‌ఎదుట హాజరయ్యారు. ఈనిర్ణయమే ఆందోళనను కొంత సద్దుమణిగేలా చేస్తుందని ఎన్నికల సంఘం భావిస్తోంది.