మిజోరంలో 49% , మధ్యప్రదేశ్‌లో 27%

mizo elections
mizo elections

భోపాల్‌, ఐజ్వాల్‌: మధ్యప్రదేశ్‌, మిజోరాంలలో ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతుంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి మధ్యప్రదేశ్‌లో 27 శాతం పోలింగ్‌ నమోదైందని, మిజోరంలో 49 శాతం పోలింగ్‌ నమోదైందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. మధ్యప్రదేశ్‌లో సాంకేతిక సమస్యల కారణంగా దాదాపు 250 ఈవిఎంలను, పలు వివి ప్యాట్‌ మెషిన్లను మార్చారు. పలు పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్‌ కొన్ని గంటల పాటు నిలిపివేశారు. మధ్యప్రదేశ్‌లోని భింద్‌ జిల్లాలోని ఓ పోలింగ్‌ కేంద్రం వద్ద గుర్తు తెలియని కాల్పులు జరపగా పోలింగ్‌ ఏజెంట్‌ గాయపడ్డాడు. ఈ ఘటనలో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు.
మిజోరంలోని ఐజ్వాల్‌ జిల్లాలో మధ్యాహ్నానానికి 45 శాతం పోలింగ్‌ నమోదు కాగా,సెర్‌షిప్‌ జిల్లాలో 55 శాతం పోలింగ్‌ నమోదైనట్లు సమాచారం. మధ్యప్రదేశ్‌లో 230 స్థానాలకు, మిజోరంలో 40 స్థానాలకు ఈ రోజు పోలింగ్‌ జరుగుతుండగా..ఇక్కడ డిసెంబరు 11న ఫలితాలు వెలువడనున్నాయి.