మా సోదరికి విజయం వరించాలి

ntr,kalyan,suhasini
ntr,kalyan,suhasini

హైదరాబాద్‌: తాత,తండ్రి,బాబాయి స్ఫూర్తితో ప్రజాసేవకు సిద్దపడుతున్న మా సోదరి నందమూరి సుహాసినికి విజయం వరించాలని కోరుకుంటున్నాం అని ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ అన్నారు. ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అనే సిద్ధాంతంతో మా తాతగారు స్వర్గీయ ఎన్టీఆర్‌ పార్టీని స్థాపించారు. టిడిపి మాకు ఎంతో పవిత్రమైనది. మా నాన్న హరికృష్ణ టిడిపి కు ఎనలేని సేవలందించారు. మా సోదరి సుహాసిని కూకట్‌పల్లి నుంచి పోటీ చేస్తున్న విషయం మీకు తెలిసిందే. సమాజంలో స్త్రీలు ఉన్నతమైన పాత్ర పోషించాలని నమ్మే కుటుంబం మాది.. జై ఎన్టీఆర్‌. జోహార్‌ హరికృష్ణ.గఅని కల్యాణ్‌రామ్‌, ఎన్టీఆర్‌ పేర్కొన్నారు.