మా ఆవేదనను స్పీకర్‌ లైట్‌గా తీసుకుంటున్నారు: సుజనా

SUJANA
SUJANA

న్యూఢిల్లీ: తమ ఆందోళనలను లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ లైట్‌గా తీసుకుంటున్నారని టిడిపి ఎంపి సుజనాచౌదరి ఆందోళన వ్యక్తం చేశారు. తమ ఎంపీల విజ్ఞప్తులపై స్పీకర్‌ సానుకూలంగా స్పందించలేదని ఆరోపించారు. స్పీకర్‌ తీరు బాధాకరమని సుజనా చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. ఏపి హక్కుల కోసం ఎన్ని మార్గాల్లో ప్రయత్నం చేయాలో అన్నీ చేస్తామని కొన్ని పార్టీల సహకారంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని దుయ్యబట్టారు.