” మా అమ్మ ఎక్కువ కాలం భారత్‌లోనే ఉంది”

Rahul
Rahul

బెంగళూరు: కర్ణాటక ఎన్నికల్లో భాగంగా తనపై వ్యక్తిగత దాడి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదికి దీటుగా సమాధానిమిచ్చారు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ . తన తల్లి సోనియా గాంధీ ఇటాలియన్‌ ఐనా ఎక్కువ కాలం భారతదేశంలోనే ఉన్నారని, ఇక్కడున్న భారతీయుల కంటే ఎక్కువగానే సంస్కృతి, సాంప్రదాయాలను ఆమె సొంతం చేసుకున్నారని రాహుల్‌ అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలతో మోది తానేంటో నిరూపించుకున్నారు. అలా మాట్లాడటమే ఆయనకు ఇష్టమైతే మాట్లాడనివ్వండి. నాకు వచ్చిన ఇబ్బందేమీ లేదు అని రాహుల్‌ ఘాటుగా స్పందించారు. రాహుల్‌ పరిపక్వత లేని మనిషి అని, ఇంటిపేరుతో నెట్టుకొస్తున్నారన్న మోది విమర్శలపై ఇలా స్పందించారు.