మాస్టర్‌రోస్టర్‌లో సుప్రీం అధికారాలేమిటి?

SUPREME COURT
SUPREME COURT

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో కేసులను వివిధ బెంచ్‌లకు కేటాయించేవిధానం ఏకపక్షంగా సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి ఒక్కరేచేసేందుకు వీలులేదని, సుప్రీం కొల్లిజియం సంఘటితంగా ఈ కేటాయింపులు చేయాల్సి ఉంటుందని ప్రముఖ న్యాయవాది మాజీ న్యాయశాఖమంత్రి శాంతిభూషణ్‌ శుక్రవారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలుచేసారు. అంతేకాకుండా చీఫ్‌జస్టిస్‌ మాస్టర్‌రోస్టర్‌ అధికారాలను స్పష్టంచేయాలనికోరారు. అలాగే మాస్టర్‌రోస్టర్‌ కేవలం ఒకే ఒక్కరి అధికారాలకు పరిమితం కాదని, ఏకపక్ష అధికారాలు ఉండకూడదని ఆయన స్పష్టంచేసారు. 2013 సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారంచూస్తే పరిపాలనపరంగా ప్రధాన న్యాయమూర్తికేసులను కేటాయించాల్సిఉంటుందని, పారదర్శక విధానం అమలుచేయాలనిసూచిస్తోందని, వివిధ బెంచ్‌లకు కేసుల కేటాయింపులో పారదర్శకత పాటించాలన్న ఖచ్చితమైన నిబంధనలున్నాయని ప్రశాంత్‌భూషణ్‌ అన్నారు. ఆయన దాఖలుచేసిన పిటిషన్‌లో సుప్రీంకోర్టుప్రధాన న్యాయమూర్తి అంటే సీనియర్‌ జడ్జిల కొల్లిజియంగా పరిగణించాలనిసూచించారు. ఛీఫ్‌జస్టిస్‌ ఏకపక్షంగా వివిధ బెంచ్‌లకు కేసులను కేటాయించడానికి లేదని, సమిష్టిగా కొల్లిజియం నిర్ణయానుసారం కేసులు వివిధ బెంచ్‌లకు కేటాయిస్తారన్నారు. ఛీఫ్‌జస్టిస్‌ దీపక్‌మిశ్రా అధ్యక్షతన ఉన్న ఐదుగురుసభ్యులున్న రాజ్యాంగ ధర్మాసనం స్వల్పవ్యవధిలోనే సమావేశం అయి చీఫ్‌జస్టిస్‌కు మాస్టర్‌ రోస్టర్‌పై చర్చించిందని, ఈ రాజ్యాంగ బెంచ్‌ ఆసమయంలో సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ జారీచేసిన ఉత్తర్వులను రాజ్యాంగధర్మాసనం రద్దుచేసిందని ఆయన అన్నారు జస్టిస్‌ చలమేశ్వర్‌ ఉత్తర్వులు ప్రనకారంచూస్తే సీనియర్‌మోస్ట్‌ జఢ్జిలతో ఉన్న బెంచ్‌ లక్నో వైద్యకళాశాల కుంభకోణంను స్వతంత్రంగా దర్యాప్తుచేయాలన్న పిటిషన్లను విచారణచేయాలని ఆదేశించింది. ఈకళాశాల అధికారులు సుప్రీంకోరుఎ్ట న్యాయమూర్తులకు లంచాలివ్వచూపారన్న అభియోగాలపై జస్టిస్‌ చలమేశ్వర్‌ ఈ ఉత్తర్వులుజారీచేసారు. వైద్యకళాశాల కేసును ఛీఫ్‌జస్టిస్‌ అధ్యక్షతన ఉన్న బెంచ్‌ విచారించింది. ఇదే తరుణంలో ఈ ఏడాది జనవరి 12వ తేదీ నలుగురు సీనియర్‌ న్యాయమూర్తులు జస్టిస్‌ జాస్తిచలమేశ్వర్‌, జస్టిస్‌ రంజన్‌గగో§్‌ు, జస్టిస్‌మదన్‌ బి లోకూర్‌, జస్టిస్‌ కురియన్‌జోసెఫ్‌లు ప్రజల్లోనికి వచ్చి వివిధబెంచ్‌లకు కేసుల కేటాయింపులో జరుగుతున్న తీరునుప్రశ్నించారు. ప్రశాంత్‌భూషన్‌ తన పిటిషన్‌లో చీఫ్‌జస్టిస్‌కు ఉన్న పరిపాలనాధికారాలు ఏమిటో స్పష్టంచేయాలని, మాస్టర్‌ రోస్టర్‌ అధికారాలు ఆయన ఒక్కరికేనా అన్నది స్పష్టంచేయాలనికోరారు. మాస్టర్‌రోస్టర్‌ను ఏఒక్కరి విచక్షణాధికారాలతోనో కేటాయింపులు జరగవని, ఛీఫ్‌జస్టిస్‌ ఎంపికచేసిన బెంచ్‌లకు లేదా ఎంపికచేసినన్యాయమూర్తులున్న బెంచ్‌లకు కేటాయించడం రాజ్యాంగ విరుద్ధమని ఆపిటిషన్‌లో వెల్లడించారు. సీనియర్‌ న్యాయమూర్తులతో ఉన్న కొల్లిజియం సమిష్టి అభిప్రాయంతోనే కేసుల కేటాయింపులు జరగాల్సి ఉందన్నారు. పారదర్శకత, సమానత్వం, సీనియారిటీపట్ల గౌరవం, కొల్లిజియం పట్ల గౌరవభావాలున్నపుడే కేసుల కేటాయింపులో పారదర్శకత ఉంటుందని, దాఖలైన కేసులకు న్యాయం జరుగుతుందని ప్రశాంత్‌భూషణ్‌ వెల్లడించారు.