మాస్కోలో ట్రంప్‌ పర్యటన

Donald  Trump
Donald Trump

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ త్వరలో మాస్కోలో పర్యటించనున్నట్లు శ్వేతసౌధ వర్గాలు వెల్లడించాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ నుండి లాంఛనప్రాయ ఆహ్వానం అందిన అనంతరం ఈ పర్యటన ఉంటుందని తెలిపాయి. ఇటీవల ఫిన్లాండ్‌లో హెల్సింకిలో ట్రంప్‌,పుతిన్‌ భేటీ అయిన విషయం విదితమే. ఈ సందర్భంగా వాషింగ్టన్‌కు రావాలని పుతిన్‌ తొలుత ట్రంప్‌ ఆహ్వానించారు. కాగా అమెరికా జాతీయ భద్రత సలహాదారుడు జాన్‌ బోల్టన్‌ ప్రణాళికను మార్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం అపూ అంశంపై జరుగుతున్న విచారణ పూర్తయ్యాక ఈ పర్యటన ఉండాలని సూచించినట్లు తెలిపాయి.