మార్ఫింగ్ ఫొటోలు..పొంగిపోతున్న ఇవాంక

తాజ్ మహల్ దగ్గర ఇవాంకా దిగిన ఫొటోల్లో తమ ఫొటోలను చేర్చిన కొందరు

ivanka-trump
ivanka-trump

హైదరాబాద్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా భారత్‌ పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. భర్తతో పాటు ఆమె దిగిన ఫొటోలు, ఒంటరిగా తాజ్‌మహల్ ముందు కూర్చొని దిగిన ఫొటోలు నెట్టింట్లో హల్‌‌చల్ చేశాయి. ఈనేపథ్యంలో కొందరు ఇవాంకాతో కలిసి ఉన్నట్టుగా కొందరు మార్ఫింగ్ ఫొటోలు తయారు చేశారు. వాటిని సోషల్ మీడియాలో పెట్టారు. అయితే ట్విట్టర్ లో ఈ ఫొటోలను పెడుతూ ఇవాంకాను కూడా ట్యాగ్ చేయడంతో ఆమె స్పందించారు. తనతో కలిసి దిగినట్టుగా ఉన్న ఫొటోలను రీట్వీట్ చేశారు. తనపై చూపిస్తున్న అభిమానానికి పొంగిపోతున్నట్టుగా కూడా ట్వీట్లలో పేర్కొన్నారు. కాగా తనతో కలిసి ఉన్నట్టుగా ఫొటో షాప్ చేసిన మరికొన్ని ఫొటోలను కూడా ఇవాంకా షేర్ చేశారు. ”భారత ప్రజల అభిమానానికి పొంగిపోతున్నాను. నాకు ఎందరో కొత్త ఫ్రెండ్స్ దొరికారు”అంటూ ట్వీట్లు చేశారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/