మార్చి14న బాబ్రీ కేసు తుది తీర్పు

Babri Masjid (File)
Babri Masjid (File)

న్యూఢిల్లీః రామ జన్మభూమి-బాబ్రీ మసీదు కేసును అత్యున్నత న్యాయస్థానం మళ్లీ వాయిదా వేసింది. మార్చి 14వ తేదీన ఆ కేసుకు సంబంధించిన తుది విచారణ చేపట్టనున్నట్లు సుప్రీం తెలిపింది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు సుప్రీం ఈ కేసును టేకప్ చేసింది. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసులో ఆదేశాలను జారీ చేసింది. కేసుకు సంబంధించిన దస్తావేజులు, తర్జుమా పత్రాలు అందలేదని కోర్టు స్పష్టం చేసింది. వివిధ పిటీషనర్లు అందించిన డాక్యుమెంట్లను ఆంగ్లంలో తర్జుమా చేసి ఇవ్వాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది. బాబ్రీ కేసును కేవలం భూవివాదంగా మాత్రమే పరిశీలిస్తామని ధర్మాసనం వెల్లడించింది.