మార్చి10న వరంగల్‌లోపార్టీ ఆవిర్భావ సభ

kodandaram
kodandaram

ప్రొఫెసర్‌ కోదండరాం కొత్తగా ఏర్పాటు చేయనున్న పార్టీ ఆవిర్భావ సభ మార్చి10న వరంగల్‌లో జరగను న్నది. మిలియన్‌ మార్చ్‌ నిర్వహించిన రోజునే పార్టీ జెండా, ఎజెండా, విధి విధానాలు అన్నీ ప్రకటించే అవకా శం కనబడుతోంది. ఆదివారం నిర్వహించిన జేఏసీ విస్తృ తస్థాయి సమావేశంలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబో తున్నట్లు ప్రకటించిన కోదండరాం పేరును ప్రకటించ లేదు. అయితే తెలంగాణ జనసమితి పేరుతో పార్టీ రిజిస్ట్రేషన్‌ కోసం కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ఇప్ప టికే దరఖాస్తు చేసిన నేపథ్యంలో పార్టీ పేరు దాదాపు అదే ఉంటుందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. మార్చి 10 తర్వాత దక్షిణ తెలంగాణలో రెండు సభలు, ఉత్తర తెలంగాణలో రెండు సభలు నిర్వహించేం దుకు నిర్ణయించినట్లు సమాచారం. పార్టీ గుర్తుగా రైతు నాగలిని ఎంచుకున్నారు.